Manipur Violence: మణిపూర్లో గిరిజనుల నిరసన.. AFSPA అమలు చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురిని దుండగులు కాల్చిచంపారు. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల మటు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో మణిపూర్‌లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ అన్నారు.
Read Also: Wildfire: హవాయి దాటి వాషింగ్టన్ వైపు కార్చిచ్చు
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ను మోహరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి తప్పిన పెను ప్రమాదం..
మరోవైపు కేంద్రం జోక్యం చేసుకుని కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని మహిళా నిరసనకారులు తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని వీలైనంత త్వరగా తిరిగి అమలు చేయాలని కోరారు. మణిపూర్‌లోని అన్ని లోయ జిల్లాల్లో కొండ జిల్లాల తరహాలో AFSPAని మళ్లీ అమలు చేయాలని ఆదివాసీ ఏక్తా కమిటీ (COTU) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు మణిపూర్ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. మునుపటి ఘటనలు మరచిపోండి, శాంతియుతంగా జీవించండి అని పిలుపునిచ్చారు. అయితే రెండు రోజుల తరువాత నిరసనకారులు ముగ్గురు వ్యక్తులను చంపడం మళ్లీ హింసకు దారితీసింది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!