NTV Telugu Site icon

Agency Bandh: ఇవాళ మన్యం బంద్

Agency

Agency

Agency Bandh: నేడు ఏపీవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనుల్లో వ్యతిరేకత నెలకొంది. బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీల పిలుపునిచ్చాయి. బోయలు, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శాసనసభలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రంలోని మన్యం ప్రాంతంలో బంద్‌ నిర్వహించాలని వివిధ గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also: Pawan Kalyan : రాష్ట్రంలో రైతులు కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి

పాడేరు,అరకు,చింతపల్లి సబ్ డివిజన్లలో బంద్ ఎఫెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. అరకులోయలో పర్యాటక కేంద్రాలను మూసివేశారు. వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నారు. అరకు,పాడేరు వారపు సంతలు రద్దయ్యాయి. ఆదివాసీల బంద్‌కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. విద్యాసంస్థలు యధావిధిగా ఓపెన్‌ అవుతాయని, ఉద్యోగ, ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.