NTV Telugu Site icon

Treatment With Torch Lighting: విద్యుత్ నిలిచిపోవడంతో ఫోన్ లైట్స్ తో రోగులకు చికిత్స..

Treatment With Torch Lighting

Treatment With Torch Lighting

Treatment With Torch Lighting: కర్ణాటక రాష్ట్రములోని చిత్రదుర్గ జిల్లాలోని మొళకాల్మూరులోని ప్రభుత్వ ఆసుపత్రి తీవ్రమైన విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దీనితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఆసుపత్రి 100 పడకల సౌకర్యం ఉండడంతో అక్కడ భయంకరమైన పరిస్థితులలో వైద్య సిబ్బంది రోగులను పరీక్షించడానికి టార్చ్లు, మొబైల్ ఫోన్ టార్చ్, కొవ్వొత్తులను ఉపయోగిస్తు సేవలను అందిస్తున్నారు.

High BP: అధిక రక్తపోటు లక్షణాలు ఎలావుంటాయంటే.. జాగ్రత్త సుమీ..

సరైన లైటింగ్ లేకుండా పనిచేయడానికి ఆసుపత్రి చేస్తున్న కష్టాలను తెలిపే ఫోటోలు వైరల్ అయ్యాయి. గత వారంగా జనరేటర్ మరమ్మతు చేయలేని స్థితిలో ఉండడంతో ఆసుపత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడి రోగులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Sexual Assault : సుల్తాన్ బజార్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి

ఇక ఆ నియోజక ఎమ్మెల్యే ఎన్వై గోపాలకృష్ణ మాట్లాడుతూ., ఆసుపత్రిలో 100 KW జనరేటర్ మాత్రమే ఉందని, అయితే ఆసుపత్రిలో 100 కి పైగా పడకలు ఉండడంతో అక్కడ 250KW జనరేటర్ అవసరమని తెలిపారు. చీఫ్ డాక్టర్ కు బిజెపితో అనుబంధం ఉందని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వారు స్థానిక ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని తెలియజేయలేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఎన్వై గోపాల కృష్ణ 250KW జనరేటర్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమస్యకు గత శాసనసభ్యుడే కారణమని ఆయన ఆరోపించారు.

Show comments