Site icon NTV Telugu

Ganja Transport: రైలులో గంజాయి తరలింపు.. రూ. 10 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

Ganja

Ganja

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని గురువారం ఉదయం రైల్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌ నుంచి ముంబై వెలుతున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయిని పట్టుబడింది. ఖమ్మం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు మహబూబాబాద్‌ వరకు ప్రయాణించి రెండు సూటు కేసుల్లో అక్రమంగా తరలివెలుతున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు మాత్రం తప్పించుకున్నారు.

Woman Saree: ఇది కదా.. భారతీయ సంప్రదాయం అంటే.. చీరకట్టులో యువతిని చూసి.. జపాన్ ప్రజలు షాక్..

రెండు సూట్‌కేసుల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని పంచానామా నిర్వహించారు. అనంతరం 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా గంజాయి ఒరిస్సా నుంచి ఖమ్మం, భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు తరలి వెలుతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో పలు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 300 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. కోణార్క్‌ రైల్లో తనిఖీల్లో భాగంగా పట్టుబడిన గంజాయిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిషనర్‌ గణేష్‌, ఎకైజ్‌ డిప్యూటి కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డిలు పట్టుబడిన గంజాయిని పరిశీలించారు. అనంతరం గంజాయిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కోణార్క్‌ రైల్లో గంజాయిని పట్టుకున్న వారిలో సీఐ సిహెచ్‌ శ్రీనివాస్‌, కానిస్టేబుల్స్‌ సుధీర్‌, హరీష్‌, వెంకటేశంలు ఉన్నారు.

Swati Maliwal assault: స్వాతి మలివాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. దాడిపై ఆరా..

Exit mobile version