రెండు రోజుల కిందట కరీంనగర్ జిల్లాలో కేంద్రంలోని ఓ పెళ్లి వేడుక జరిగింది. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి కొడుకు పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లి వేదికపైకి వెళ్లారు. వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో పెళ్లి కుమారుడి తండ్రి రూ. 5 వేలు ఇచ్చాడు. తమకు ఇవి సరిపోవు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : Boora Narsaiah Goud: మోడీ కాదు.. ముందు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి
ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు.. చేసేది ఏమీ లేక వధువు వరుడు తరపున రూ. 50 వేలు ఇచ్చిన అక్కడి నుంచి పంపించారు. ఇలా ఒక్క కరీంనగర్ లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లలో హిజ్రాలు హల్ చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ. 5 నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ సమీప మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ బంధువు వివాహం జరిగింది. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి నగ్నంగా డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారు పారిపోయారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని అడిగినంత డబ్బు ముట్టజెప్పారు.
Also Read : India invites Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రికి భారత్ ఆహ్వానం..
పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక.. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు.. కానీ.. ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు ఏర్పాడ్డాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవరిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో హిజ్రాల పేరు చెబితేనే జంకుతున్నారు.