Site icon NTV Telugu

TS Election: తెలంగాణ పాలనా వ్యవస్థపై ఈసీ కొరడా.. ఐఏఎస్, ఐపీఎస్‌లపై బదిలీ వేటు

Ts Election

Ts Election

TS Election: తెలంగాణ పాలనా వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. కమిషనర్లకు కూడా స్థానచలనంకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సీపీ వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ సంచాలకుడు ముషారఫ్‌ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Alsor Read: MP K Laxman : సీఎం కాలేదని ఫ్రస్ట్రేషన్‌లో స్థాయిని మించి మాట్లాడుతున్నారు

రేపు సాయంత్రం 5 గంటల లోపు బదిలీ చేసిన అధికారుల స్థానంలో కొత్త వారి నియామకం కోసం జాబితాను కేంద్ర ఎన్నికల సంఘంకు రాష్ట్ర సర్కారు జాబితాను పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను పంపాల్సి ఉంటుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో నియమించవచ్చు. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అధికారం ఉంటుంది. మళ్ళీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంను ఈసీ కోరవచ్చు. ఈసీ ఫైనల్ చేసిన తర్వత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్‌ అధికారులు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఎన్నికల సంఘం అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

Exit mobile version