Aircraft Crash: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోవడంతో పైలట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. ట్రైనింగ్‌లో ఉండగా.. గుడిగోపురం, చెట్టును ఢీకొట్టడంతో విమానం కూలిపోయింది. ఈ విమానం చోర్హట్టా ఎయిర్‌స్ట్రిప్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ శిఖరాన్ని ఢీకొట్టి కూలిపోయిందని చోరహట్టా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జేపి పటేల్ తెలిపారు.
Joshimath Land Subsidence: జోషీమఠ్‌లో 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు..
ఈ ప్రమాదంలో కెప్టెన్ విశాల్ యాదవ్ (30) మృతి చెందగా, ట్రైనీ పైలట్ అన్షుల్ యాదవ్ గాయపడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరినట్లు అధికారి తెలిపారు. రేవా కలెక్టర్ మనోజ్ పుష్ప్, పోలీసు సూపరింటెండెంట్ నన్వనీత్ భాసిన్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.