మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు శృతి హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ట్రైన్’ (Train). ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కన్నకుళికారా’ నేడు విడుదల కాబోతోంది.
Also Read : Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్
ఈ పాటను ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విశేషమేమిటంటే, ఈ రొమాంటిక్ మెలోడీని దర్శకుడు మిస్కిన్ స్వయంగా కంపోజ్ చేయగా, శృతి హాసన్ తన గొంతుతో ప్రాణం పోశారు. కబిలన్ ఈ పాటకు సాహిత్యం అందించారు. విజయ్ సేతుపతి రఫ్ లుక్‌లో, శృతి హాసన్ క్లాసీ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాను కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. నటిగానే కాకుండా సింగర్‌గా కూడా మంచి గుర్తింపు ఉన్న శృతి హాసన్, ఈ మెలోడీతో మ్యూజిక్ లవర్స్‌ను పలకరించబోతోంది. మిస్కిన్ మార్క్ మ్యూజిక్, శృతి గొంతు తోడవ్వడంతో ఈ పాటపై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
