TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ షాక్.. ఇక చౌక రీఛార్జ్ ప్లాన్లు మొదట కనిపించాల్సిందేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRAI New Rules: మొబైల్ రీఛార్జ్ చేసుకునేవారికి సంబంధిత టెలికం సంస్థకు చెందిన యాప్‌లలో ఇబ్బందులు తప్పడం లేదు.. సదరు సంస్థ అందించే అన్ని ప్లాన్లు అందులో కనబడడం లేదనే ఫిర్యాదులు ఉండగా.. చౌవకైన ప్లాన్లు మొదట ఉండడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.. అయితే, మొబైల్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఉపయోగపడేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టెలికాం కంపెనీలు తమ మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లలో తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లను సులభంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించింది. ముఖ్యంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలకు ఈ ఆదేశాలు కొత్త సవాలుగా మారాయి. చౌకైన రీఛార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు అనేక పేజీలు వెతకాల్సిన పరిస్థితికి చెక్ పెట్టడమే ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
జియో, ఎయిర్‌టెల్‌కు అసలు సమస్య ఏమిటి?
సాధారణంగా జియో, ఎయిర్టెల్ యాప్‌లను తెరిచినప్పుడు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఓటీటీ ప్రయోజనాలతో కూడిన వివిధ రీఛార్జ్ ప్లాన్లు కనిపిస్తాయి. అయితే ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం కాలింగ్ కోసం తక్కువ ధర ప్లాన్ తీసుకోవాలనుకునే వారికి వాటిని వెతకడం కొంత కష్టంగా మారుతోంది. టెలికాం కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలు కలిగిన ఖరీదైన ప్లాన్లను కొనుగోలు చేసేలా వినియోగదారులను ప్రోత్సహిస్తుంటాయి. కేవలం వాయిస్ కాలింగ్ సదుపాయం ఉండే చౌక ప్లాన్లకు బదులుగా డేటా, ఇతర అదనపు ప్రయోజనాలు ఉన్న రీఛార్జ్‌లను ఎంచుకునేలా చేస్తాయి. అయితే చౌకైన ప్లాన్లను యాప్‌లో మొదట చూపిస్తే ఎక్కువ మంది వాటినే ఎంచుకునే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల తమ ఆదాయంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read
- Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
- Modi Delimitation Formula: డీలిమిటేషన్ బిల్లులపై మారుతున్న సమీకరణాలు.. మోడీ మాస్టర్ ప్లాన్..! దక్షిణాది పార్టీల వైఖరిలో మార్పు!
- CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
ట్రాయ్ కొత్త ఆదేశాల్లో ఏముంది?
2026 అక్టోబర్ 1న ట్రాయ్ టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అన్ని టెలికాం సంస్థలు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ విభాగంలో ‘TRAI-Mandated Packs’ పేరుతో ప్రత్యేక ట్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. ఈ ట్యాబ్‌లో ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఉండే రీఛార్జ్ ప్లాన్ల వివరాలను అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లోని ప్రీపెయిడ్ రీఛార్జ్ విభాగంలో ఈ ట్యాబ్ అన్నింటికంటే ముందుగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఇతర ముఖ్యమైన విక్రయ కేంద్రాల్లో కూడా ఈ ప్లాన్లను ప్రముఖంగా ప్రదర్శించాలని సూచించింది ట్రాయ.. అంతేకాదు.. ఈ మార్పులను అమలు చేసిన 30 రోజుల్లోగా సంబంధిత నివేదికను సమర్పించాలని కంపెనీలను ఆదేశించింది.
వినియోగదారుల ఫిర్యాదులతో ట్రాయ్ చర్యలు
చౌకైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం కష్టంగా ఉందని వినియోగదారుల నుంచి ట్రాయ్‌కు ఫిర్యాదులు అందాయి. కొన్ని టెలికాం కంపెనీల యాప్‌లలో తక్కువ ధర ప్లాన్లను కనుగొనడానికి అనేక పేజీలు, కేటగిరీలను పరిశీలించాల్సి వస్తోందని రెగ్యులేటర్ గుర్తించింది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉన్న చౌకైన ప్లాన్ల గురించి స్పష్టమైన సమాచారం అందడం లేదని భావించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్యాబ్‌ను మొదటి స్థానంలో ఉంచాలని ఆదేశించింది.
జియో, ఎయిర్టెల్ ఆదాయంపై ప్రభావం ఉంటుందా? చౌకైన రీఛార్జ్ ప్లాన్ల ప్రదర్శన విషయంలో టెలికాం కంపెనీలు ఆందోళన చెందడానికి ప్రధాన కారణం ARPU. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. ఒక టెలికాం సంస్థ ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున ఎంత ఆదాయం సంపాదిస్తుందో దీనిద్వారా తెలుస్తుంది. వినియోగదారులు ఎక్కువ ధర కలిగిన డేటా, కాలింగ్ ప్లాన్లను కొనుగోలు చేస్తే కంపెనీలకు అధిక ఆదాయం వస్తుంది. అదే వినియోగదారులు తక్కువ ధర వాయిస్ ఓన్లీ ప్లాన్లకు మారితే ఒక్కో కస్టమర్‌పై వచ్చే ఆదాయం తగ్గుతుంది. అందుకే చౌకైన ప్లాన్లను మొదటి స్థానంలో ప్రదర్శించాలనే నిబంధనపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ప్రభావం భారీగా ఉండకపోవచ్చని యాక్సిస్ క్యాపిటల్ విశ్లేషకులు అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. వినియోగదారులు చౌకైన ప్లాన్లకు మారితే భారతీ ఎయిర్టెల్ మొబైల్ ఆదాయంపై గరిష్టంగా ఒక శాతం కంటే తక్కువ ప్రభావం ఉండవచ్చని, వొడాఫోన్ ఐడియా (Vi)పై సుమారు 2.3 శాతం ప్రభావం ఉండవచ్చని అంచనా వేసింది.
జియో, ఎయిర్టెల్ యాప్స్‌లో మార్పులు వస్తాయా?
అయితే, ట్రాయ్ ఆదేశాలను కంపెనీలు అమలు చేస్తే జియో, ఎయిర్టెల్ యాప్‌లలో రీఛార్జ్ చేసుకునే విధానంలో మార్పులు కనిపించనున్నాయి. వినియోగదారులు యాప్ తెరిచిన వెంటనే ‘TRAI-Mandated Packs’ అనే ప్రత్యేక ట్యాబ్‌ను చూడగలుగుతారు. తద్వారా తక్కువ ధర కాలింగ్ ప్లాన్ల కోసం వివిధ విభాగాల్లో వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. జియో మాత్రం తాము ఇప్పటికే ట్రాయ్ నిబంధనలను పాటిస్తున్నామని చెబుతోంది. అయితే జియో, ఎయిర్టెల్ యాప్‌లలో ఈ ప్లాన్లు మొదటి ట్యాబ్‌లో కనిపించడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం ఈ ప్లాన్లను మొదటి ట్యాబ్‌లోనే అందుబాటులో ఉంచింది. మొత్తంగా చూస్తే, ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మొబైల్ వినియోగదారులకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ కోసం రీఛార్జ్ చేసుకునే వారికి చౌకైన ప్లాన్లను గుర్తించడం సులభం కానుంది. మరి జియో, ఎయిర్టెల్ తమ యాప్‌లు, వెబ్సైట్లలో ఎలాంటి మార్పులు చేస్తాయి? ట్రాయ్ ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తాయా? అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ షాక్.. ఇక చౌక రీఛార్జ్ ప్లాన్లు మొదట కనిపించాల్సిందేనా..?
-
Rohit Sharma : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్‌కు గుడ్‌బై!
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. డీలిమిటేషన్, అమరావతి, పెట్టుబడులపై ఏమన్నారంటే?
-
Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!