Site icon NTV Telugu

Yellareddyguda incident : దారుణం.. లిఫ్టులో ఇరుక్కుని ఏడేళ్ల బాలుడి మృతి

Yellareddyguda

Yellareddyguda

Yellareddyguda incident : అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విషాదం నెలకొంది. కీర్తి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో ఏడు ఏళ్ల చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కీర్తి టవర్స్ ఐదో అంతస్తులోని 503 ఫ్లాట్ లో ఐశ్వర్య, నర్సీ నాయుడు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండో కొడుకు హర్ష వర్ధన్ (7) అమీర్పేట ఎల్లారెడ్డి గూడలోనీ ఓ ప్రైవేట్ స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో హర్ష స్కూల్‌ నుంచి ఇంటికి చేరుకున్నాడు.

Read Also : Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్

తరువాత తల్లి ఐశ్వర్యతో కలిసి ఐదో అంతస్తులోని తమ ఫ్లాట్ నుంచి కిందికి రావడానికి లిఫ్ట్ వద్దకు వెళ్లాడు. లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకోగానే బాలుడు లోపలికి అడుగుపెట్టేందుకు ముందుకు అడుగు వేశాడు. అయితే దురదృష్టవశాత్తు లిఫ్ట్ ముందు భాగంలోని డోర్, లోపలి గ్రిల్ మధ్య ఉన్న చిన్న గ్యాప్‌లో ఇరుక్కుని చనిపోయాడు. అరుపులు వినిపించేలోపే బాలుడు నాలుగో అంతస్తులో వేలాడుతున్నాడని అపార్టుమెంట్ వాసులు చెబుతున్నారు. ఐశ్వర్య అరుపులు విని పొరుగువారు పరుగున వచ్చేసేలోపే లిఫ్ట్ కదులుతుండడంతో హర్ష నాలుగో అంతస్తు వరకూ వేలాడుతూ వెళ్లిపోయాడు. వెంటనే లిఫ్ట్ ఆపి చిన్నారిని బయటకు తీశారు. తొందరగా సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే హర్ష ప్రాణం కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

Read Also : Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?

Exit mobile version