Site icon NTV Telugu

Tragedy: విహారయాత్రలో విషాదం.. జలపాతంలో పడి ఓ వ్యక్తి మృతి

Student Drown

Student Drown

Tragedy: విహారయాత్రలో విషాదం అలముకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పోల్లూరు జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి చెందిన వై.కొండయ్య (33) ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయారు.

Read Also: TDP: టీడీపీకి షాక్‌.. పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే

సుమారు 25 మంది స్నేహితులు కలిసి విహారయాత్ర కోసం సాయి దుర్గ ట్రావెల్ బస్సులో మోతుగూడెంలోని పోల్లూరు జలపాతం వద్దకు వచ్చారు. వీరంతా రంగంపేట మండలంలోని లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు కాలుజారి కొండయ్య జలపాతంలో పడిపోయినట్లు అతని స్నేహితులు వెల్లడించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version