Site icon NTV Telugu

Suicide Attempt: దారుణం.. ఇద్దరు చిన్నారులను సంపులో పడేసిన తల్లి.. తాను ఆత్మహత్య హత్యాయత్నం!

Suicide Attempt

Suicide Attempt

Suicide Attempt: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ తన ఎనిమిది నెలల శిశువు, మూడేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఉన్న సంపులో పడవేసి.. తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీని కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

కిల్లింగ్ లుక్స్ తో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన Harley-Davidson Street Bob 2025.!

లక్ష్మీ ఆత్మహత్యాయత్నం వెనుక ఉన్న కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన బాచుపల్లి పోలీసులు, మరణానికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Rajiv Gandhi Jayanti: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు!

Exit mobile version