NTV Telugu Site icon

Tragedy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. బీర్లు అడిగాడని యువకుడిపై దాడి

Fight

Fight

మద్యం షాప్ లో బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్‌ షాపు నిర్వాహకులు. ఈ దాడిలోగాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది . అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్‌ (26) గత నెల 26న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్‌ వద్దకు వెళ్లి బీర్‌ కావాలని షాప్‌ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల షాటేజ్ కారణంగా ఎక్స్ట్రా రేట్ కు విక్రయిస్తున్న వైన్స్‌ నిర్వాహకులతో శ్రీకాంత్ కు మాటా మాటా పెరిగింది . రెచ్చిపోయిన వైన్స్‌ షాప్‌ నిర్వాహకులు.. మరో పది మందిని తీసుకొచ్చి శ్రీకాంత్‌ను బలవంతంగా షాపులోకి ఈడ్చుకెళ్లారు.

 

ఆ తర్వాత పిడిగుద్దులతో విచక్షణారహితంగా చావగొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన శ్రీకాంత్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాలేయం , కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్న శ్రీకాంత్ చికిత్స పొందుతూ సోమవారం రోజు మ్రుతి చెందాడు . అయితే గొడవ జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ తీసుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు . మరో పక్క మద్యం షాప్ నిర్వహాకులకు ఎక్సైజ్ అదికారులతో పాటు , పోలీసులు సహకరిస్తున్నారని , శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు , ప్రజాసంఘాలు మండి పడుతున్నాయి . భాద్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.