తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ షో నిర్వహిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవాళ నగరంలో ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించబడుతుంది అని వెల్లడించారు.
Also Read: Srireddy : హీరో అభిరామ్ పై బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి..
1. AIG హాస్పిటల్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ- లెప్ట్ టర్నింగ్- సైబర్ టవర్స్- రైట్ టర్నింగ్- COD జంక్షన్ – నీరు జంక్షన్ – జూబ్లీహిల్స్ వద్ద మళ్లించబడుతుంది.
2. బయో డైవర్సిటీ, టీ-హబ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ – సైబర్ టవర్స్ – రైట్ టర్న్ – COD జంక్షన్ – నీరూస్ జంక్షన్ – జూబ్లీ హిల్స్ వద్దకు మళ్లించబడుతుంది.
3. రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రోడ్ నెంబర్ లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద మళ్లిస్తారు. IKEA ఫ్లై ఓవర్ మూసివేయబడుతుంది.
Also Read: Andhrapradesh: రాష్ట్రంలో భగభగలే.. 46 డిగ్రీలకు చేరువైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు జూన్ 22న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో ముగియనున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, పాఠశాలల్లో అంతటా ప్రజలు అమరవీరులకు నివాళులర్పించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.