డైరెక్టర్ తేజ – దగ్గుబాటి హీరో అభిరామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అహింస ‘..ఈ సినిమా నిన్న విడుదలైంది.. మొదటి షో కే నెగిటివ్ టాక్ ను అందుకుంది.ఈ విషయం పై స్పందించిన శ్రీరెడ్డి.. డైరెక్టర్ తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. తన నోటికి పనిచెప్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి..
ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి.. డైరెక్టర్ తేజాకి.. హీరో అభిరామ్‌కి శాపనార్ధాలు పెడుతూ.. బూతులతో రెచ్చిపోతూ వార్నింగ్ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన పేరు వాడుకోవడంపై మండి పండింది శ్రీరెడ్డి.. అంతేకాదు తన అక్కసును మొత్తాన్ని చూపిస్తూ దగ్గుబాటి ఫ్యామిలిని కూడా బూతులతో తిట్టింది.. నా జీవితాన్ని నాశనం చేసినవాడిని చెప్పుతో కొట్టకుండా వాడితో సినిమాలు చేయిస్తారా అంటూ మాటల్లో చెప్పలేని బూతులతో ఓ రేంజులో తిట్టిపోసింది.. ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఇక డైరెక్టర్ తేజని టార్గెట్ చేయడం శ్రీరెడ్డికి కొత్తేం కాదు.. సీత సినిమా అప్పుడూ ఇదే అయ్యింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమా ప్రమోషన్ అప్పుడు కూడా తేజపై ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.. ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో శ్రీరెడ్డి పేరు మారు మోగింది.. ఇప్పుడు చెన్నై లో ఉంటున్న ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.. యుట్యూబ్ ఛానెల్ ను కూడా మెయింటైన్ చేస్తుంది.. అందులో అద్భుతమైన వంటలు చేస్తుంది.. తనకు నచ్చని వారిపై బూతులను తిడుతుంది..