NTV Telugu Site icon

New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

Happy New Year

Happy New Year

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్‌ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్‌ఆర్‌, ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు, క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని.. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు.. నగరంలోని 172 రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై మంగళవారం రాత్రి 11 గంటల నుండి నూతన సంవత్సర వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు చెప్పారు.

AP Free Bus Scheme: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం

ఫ్లైఓవర్లు మూసివేత:
బేగంపేట, టోలిచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు. మోటార్, టూ వీలర్, ప్యాసింజర్ వెహికిల్స్‌కు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. PVNR ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ పై కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది.. అది కూడా వీసా, టికెట్ చూపిస్తేనే.. మరోవైపు.. ఒకటో తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్ వాహనాలు, హెవీ ప్యాసింజర్ వాహనాలు హైదరాబాద్ సిటీ పరిమితుల్లోకి ప్రవేశం లేదని చెప్పారు. ఏపీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఓఆర్ఆర్ మార్గంలో వెళ్లాలని సూచించారు.

ట్యాంక్ బండ్‌కు కాలినడకన వెళ్లాలనుకునే సందర్శకులు పార్కింగ్ చేసే స్థలాలు:
సెక్రటేరియట్ విజిటర్స్ పార్కింగ్
ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన HMDA పార్కింగ్ గ్రౌండ్
GHMC ప్రధాన కార్యాలయం లేన్
రేస్ కోర్స్ రోడ్ (ఎన్టీఆర్ ఘాట్ పక్కన)
ఆదర్శ్ నగర్ లేన్ (టూవీలర్స్ మాత్రమే)
ఎన్టీఆర్ స్టేడియం

మద్యం దుకాణాలపై ఆంక్షలు:
ఇక బార్లు, రెస్టారెంట్స్‌ను అర్థరాత్రి 1గంట వరకు తెరిచి ఉంచవచ్చునని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్‌ను రాత్రి 1గంటలకు పరిమితం చేసింది. మరోవైపు.. మద్యం తాగి వాహనాలు నడపవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆల్కహాల్ సేవించి ఇంటికి వెళ్లాలనుకునే వారు క్యాబ్‌ బుక్ చేసుకుని వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10,000, లేదా 6 నెలల జైలు శిక్ష. పదే పదే ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆర్టీఏ 3 నెలలు.. అంతకంటే ఎక్కువ లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తుంది.

Show comments