Trafic Retrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎల్బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trafic Retrictions: సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేడియం మధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై ప్రముఖుల వివరాల ఆధారంగా ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం స్టేడియంను సందర్శించిన సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, మాజీ కొత్వాల్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇందుకోసం పోలీసు శాఖ సుమారు 2 వేల మందిని నియమిస్తోంది. బుధవారం మధ్యాహ్నం స్టేడియానికి చేరుకున్న బలగాలు రిహార్సల్స్ కూడా పూర్తి చేశాయి.
Read also: Revanth Reddy: మొత్తం మూడు వేదికలు.. దద్దరిల్లనున్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం
Also Read
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
- YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
- 144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా…
ఎల్బీస్టేడియం సెంటర్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని వాహనదారులు దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి సహాయం కావాలన్నా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని ట్రాఫిక్ చీఫ్ సూచించారు. వీఐపీలు, ప్రముఖులు, సామాన్య ప్రజల కోసం ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
AR పెట్రోల్ పంప్-BJR విగ్రహం-బషీర్ బాగ్ మార్గంలో నిర్ణీత సమయాల్లో సాధారణ వాహనదారులు అనుమతించబడరు. చాపెల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూం వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ల నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ శ్మశానవాటిక నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి స్క్వేర్ నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్ బాగ్ నుంచి కంట్రోల్ రూం వైపు వచ్చే వారిని లిబర్టీ ద్వారా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి.
Hi Nanna: 28.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్… ఈ టాక్ తో రీచ్ అవుతాడా?
తాజావార్తలు
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!