Hi Nanna: 28.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్… ఈ టాక్ తో రీచ్ అవుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా సినిమాతో మాస్ మర్కెట్స్ లోకి ఎంటర్ అయిన నాని… వంద కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మాములుగా ఏ హీరో అయినా అయితే దసరా లాంటి కమర్షియల్ సక్సస్ తర్వాత మాస్ సినిమాల వైపు ట్రాక్ మార్చేస్తారు. నాని మాత్రం రొటీన్ గా చెయ్యకుండా మళ్లీ ఫీల్ గుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తో హాయ్ నాన్న సినిమా చేసిన నాని, అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. నాని లవ్ స్టోరీ టచ్ చేస్తే అది గ్యారెంటీగా హిట్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని హాయ్ నాన్న సినిమా మరోసారి నిలబెట్టినట్లే ఉంది. టాక్ బాగుంది, నాని పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. నిజానికి హాయ్ నాన్న సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అనిమల్ మూవీ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ముందు హాయ్ నాన్న సినిమా కనిపించదేమో అనుకున్నారు.
ఇప్పుడు హాయ్ నాన్న సినిమాకి మంచి టాక్ వస్తుంది కాబట్టి ఈ టాక్ కలెక్షన్స్ ని ఎంతవరకు పుల్ చేస్తాయి అనేది చూడాలి. నాని హాయ్ నాన్న సినిమా 28.5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. నానికి ఉన్న మార్కెట్ అండ్ హాయ్ నాన్నకి వచ్చిన టాక్ ని బట్టి చూస్తే 60 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఒక్క రోజు గ్యాప్ లో ఇంకో సినిమా రిలీజ్ అవుతుండడం, రెండు వారాల్లో ప్రభాస్ సలార్ వస్తుండం హాయ్ నాన్న సినిమాని ఇబ్బంది పెట్టేలా ఉంది. సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. సో ఆ లోపు హాయ్ నాన్న సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవ్వాలి లేదంటే ఆ తర్వాత థియేటర్స్ కూడా ఉండే అవకాశం లేదు.
Also Read
- Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!