NTV Telugu Site icon

Trafic Retrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎల్‌బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు..

Trafic Retriction

Trafic Retriction

Trafic Retrictions: సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేడియం మధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై ప్రముఖుల వివరాల ఆధారంగా ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం స్టేడియంను సందర్శించిన సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, మాజీ కొత్వాల్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇందుకోసం పోలీసు శాఖ సుమారు 2 వేల మందిని నియమిస్తోంది. బుధవారం మధ్యాహ్నం స్టేడియానికి చేరుకున్న బలగాలు రిహార్సల్స్ కూడా పూర్తి చేశాయి.

Read also: Revanth Reddy: మొత్తం మూడు వేదికలు.. దద్దరిల్లనున్న రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా…
ఎల్బీస్టేడియం సెంటర్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్‌ చీఫ్‌ జి.సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని వాహనదారులు దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి సహాయం కావాలన్నా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని ట్రాఫిక్ చీఫ్ సూచించారు. వీఐపీలు, ప్రముఖులు, సామాన్య ప్రజల కోసం ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు.

AR పెట్రోల్ పంప్-BJR విగ్రహం-బషీర్ బాగ్ మార్గంలో నిర్ణీత సమయాల్లో సాధారణ వాహనదారులు అనుమతించబడరు. చాపెల్‌ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూం వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ల నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ శ్మశానవాటిక నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి స్క్వేర్ నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్ బాగ్ నుంచి కంట్రోల్ రూం వైపు వచ్చే వారిని లిబర్టీ ద్వారా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి.
Hi Nanna: 28.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్… ఈ టాక్ తో రీచ్ అవుతాడా?