Site icon NTV Telugu

Traffic Diversion: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Diversion

Traffic Diversion

మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ హనుమంతు రావు ల ప్రెస్ మీట్ నిర్వహించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ నుండి కొండాపూర్ వైపు నూతన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందిని, కావునా ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.. గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్ళే రహదారి ని కొన్ని రోజుల పాటు మూసివేస్తున్నామని తెలిపారు.. 90 రోజుల పాటు అంటే 13.05.2023 నుండి 10.08.2023 వరకు 24 గంటలు వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్ళాలని సూచించారు.. ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించారు.

Also Read : Pakistan: విధ్వంసానికి ఆర్ఎస్ఎస్, బీజేపీనే కారణమట.. పాకిస్తాన్ లో వింతవాదన..

1. ORR నుండి హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ -AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్.- హఫీజ్‌పేట వద్ద మళ్లించబడుతుంది.

2. లింగంపల్లి నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ట్రాఫిక్ PS -DLF రోడ్ – రాడిసన్ హోటల్ – కొత్తగూడ కొండాపూర్ వద్ద మళ్లించబడుతుంది.

3. విప్రో జంక్షన్ నుండి ఆల్విన్ X రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ IIIT జంక్షన్ – ఎడమ మలుపు – గచ్చిబౌలి స్టేడియం – DLF రోడ్ – రాడిసన్ హోటల్ – కొత్తగూడ ఫ్లైఓవర్- ఆల్విన్ వద్ద U టర్న్‌ని మళ్లిస్తారు.

4. టోలిచౌకి నుండి ఆల్విన్ X రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ – మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. – సైబర్ టవర్స్ జంక్షన్. – హైటెక్స్ సిగ్నల్ వైపు ఎడమవైపు – కొత్తగూడ జంక్షన్- ఆల్విన్.

5. టెలికాం నగర్ నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి వద్ద యు-టర్న్ వద్ద మళ్లించబడుతుంది. బస్ స్టాప్ పక్కన శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ – AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ- కొండాపూర్.

6. ఆల్విన్ X RD నుండి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్‌గా మళ్లించబడుతుంది. హైటెక్స్ రోడ్డు వైపు – సైబర్ టవర్స్ మైండ్‌స్పేస్ జంక్షన్. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ – గచ్చిబౌలి / ORR.

7. ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. – మసీదుబండ – హెచ్‌సియు డిపో – లింగంపల్లి.

Exit mobile version