Site icon NTV Telugu

Jobs Fraud: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో టోకరా.. లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Job Offer

Job Offer

Jobs Fraud: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానిస్టేబుల్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధం ఏమిటనుకుంటున్నారా?. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో తన కుమార్తెకు ఏడాదికి రూ 1.75 కోట్ల ప్యాకెజీతో ఉద్యోగం అంటూ శివయ్య ప్రచారం చేసుకున్నాడు. కుమార్తె పలుకుబడి, హోదాతో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. దీనిని నమ్మిన నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు శివయ్యకు రూ. లక్షల్లో డబ్బులు ఇచ్చారు.

Read Also: Drown in Canal: కడప జిల్లాలో విషాదం.. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి

నకిలీ ఈమెయిల్ ఐడీలతోఉద్యోగాలు వచ్చినట్లు కానిస్టేబుల్ శివయ్య ఆఫర్ లెటర్లు పంపి మోసానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలుసుకుని శివయ్యను బాధితులు నిలదీశారు. బాధితుల్లో పోలీస్ సిబ్బంది, బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నారు. బాధితుడు నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడైన కానిస్టేబుల్ శివయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version