శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి భారీగా రద్దీ పెరిగింది. నిత్యం సుమారు 5 వేల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తున్నారు.. స్టూడెంట్స్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్ ఈ నెల లోనే ఎక్కువగా వెళ్తుండటం తో రద్దీ పెరిగింది. అయితే.. ఈ సందర్భంగా NTV తో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సెండాఫ్ ఇవ్వడానికి ఒక్కో స్టూడెంట్ వెనక 40 నుంచి 50 మంది వస్తున్నారన్నారు.
Also Read : Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి
ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అవుతోంది. ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆయన అన్నారు. గత పదిరోజులుగా రోజుకి లక్ష మంది ఎయిర్‌పోర్ట్ కి వస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ వచ్చేవారంతా పర్సనల్ వెహికిల్స్ తో రావడంతో ట్రాఫిక్, పార్కింగ్ కి ఇబ్బంది అవుతుందని ఆయన పేర్కొన్నారు. రోజుకు అన్ని కలిపి 70 వేలకు పైగా కార్లు ఎయిర్‌పోర్ట్ కి వస్తున్నాయని, ఒక్కో స్టూడెంట్ కి సెండాఫ్ ఇవ్వడానికి కేవలం నలుగురు మాత్రమే రావాలి అని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ నెల 20 వరకు ఎయిర్‌పోర్ట్ లో హై అలెర్ట్ ఉందని ఆయన తెలిపారు. ఎయిర్పోర్ట్ లో ఆంక్షలు ఉంటాయి కాబట్టి సెండాఫ్ కోసం వచ్చే వాళ్ళు అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ ఫోకస్
