Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Ganji: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో ఒకటి. వీటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాగి తింటే శరీరంలో వేడి పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, రాగిని పెరుగుతో కలిపి గంజి రూపంలో తీసుకుంటే అది శరీరానికి సహజమైన కూలెంట్‌గా పనిచేస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయ ‘రాగి గంజి’ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి దీనిని ఎలా తాయారు చేస్తారో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
* రాగి పిండి – ¼ కప్పు
* నీరు – 3 కప్పులు
* చిక్కటి పెరుగు – 1 కప్పు
* చిన్న ఉల్లిపాయలు – 5 (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (తరిగినది)
* ఉప్పు – 1 టీస్పూన్
* అవసరమైతే అదనపు నీరు
Also Read
- Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
- Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
- US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
- ఫిఫా వరల్డ్‌కప్‌లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
తయారీ విధానం:
* ముందుగా రాగి పిండిని తగినంత నీటిలో కలిపి రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల రాగిలో సహజ ప్రోబయోటిక్స్ ఏర్పడి జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
* మరుసటి రోజు పైన ఏర్పడిన నురుగును తొలగించి, మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాత్రలో మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రాగి మిశ్రమాన్ని పోస్తూ కలుపుతూ ఉండాలి.
* మధ్యస్థ మంటపై సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా చిక్కబడిన తర్వాత మంట ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
* చల్లారిన రాగి మిశ్రమంలో చిక్కటి పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మళ్లీ బాగా కలపాలి.
* మిశ్రమం మరీ చిక్కగా ఉంటే అవసరమైనంత నీరు జోడించి గంజిలా చేసుకోవాలి. అంతే.. ఆరోగ్యకరమైన రాగి గంజి సిద్ధం.
ఆరోగ్య ప్రయోజనాలు:
* శరీరానికి సహజమైన చల్లదనాన్ని అందిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలను బలపరుస్తుంది.
* ఐరన్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలుగుతుంది.
* గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో మధుమేహ రోగులకు అనుకూలంగా ఉంటుంది.
* 30 ఏళ్లు దాటిన మహిళలు, ఎదుగుదల దశలో ఉన్న పిల్లలకు ఇది మంచి పోషకాహారం.
తాజావార్తలు
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
-
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
-
Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
-
Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన 200 కోట్ల క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!