Site icon NTV Telugu

TPCC Mahesh Goud : బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడి.. టీపీసీసీ సీరియస్

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపైన టీపీసీసీ (TPCC) సీరియస్‌గా స్పందించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టడం అవసరం అయినా, రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, యూత్ కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదని ఆయన అన్నారు.

CM Chandrababu: కుప్పం అభివృద్ధికి ‘జననాయకుడు’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం..

యూత్ నేతలను పిలిచి వారిని మందలించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీజేపీ నేతలు కూడా ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య సంస్కృతి కాపాడాలని, శాంతి భద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాల్సిన అవసరం ఉందని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్యం లో దాడులు పద్ధతి కాదన్నా మహేష్‌ కుమార్‌ గౌడ్‌.

Boy Missing : కలకలం రేపుతున్న గురుకుల పాఠశాలలో విద్యార్థి అదృశ్యం

Exit mobile version