TPCC Mahesh Goud : మహేశ్వరం గట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ క్రాంతి బూనియాది ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం యూత్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు టీపీసీసీ చీఫ్. మూడు రోజుల పాటు శిక్షణ శిబిర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ రాహుల్ గాంధీదే అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. యూత్ కాంగ్రెస్ ప్రపంచంలో బిగ్గెస్ట్ అండ్ క్రేజిస్ట్ అని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం దొరకడం అదృష్టం లాంటిందన్నారు మహేష్ గౌడ్. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ వలె రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని, ఏఐసీసీ మహామహులు NSUI నుంచి వచ్చిన వారే అని ఆయన అన్నారు.
Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు
అంతేకాకుండా..’హిమాచల్ సీఎం, అరుణాచల్ మాజీ ముఖ్య మంత్రి వంటి నేతలు NSUI నుంచి వచ్చిన వారే.. ఓపిక..నిబద్ధత.. క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయి.. టి పీసీసీ అధ్యక్షుడిగా నేను ఉదాహరణగా చెబుతున్నా.. రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ.. పరిస్థితులకు తగ్గట్టు సమయానుసారం నడుచుకోవాలి.. వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నా సలహా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. పీసీసీ కార్యవర్గంలో యంగ్ బ్లడ్ ఉండాలని నాతో పాటు సీఎం రేవంత్ గారి ఆలోచన.. ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత యూత్ కాంగ్రెస్ నేతలపై ఉంది.. యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాపై ఫోకస్ చేయాలి.. ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పనిచేయాలి.. కష్టపడి పనిచేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తాం.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుంది.. రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించే హక్కు ఉంటుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
University Scam: ఆ యూనివర్సిటీలో 44 లక్షల కుంభకోణం.. టీ, బిస్కెట్ల కోసం రూ.8 లక్షలు ఖర్చు..