Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖలో ప్రస్తావించారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని అన్నారు.
Exam Pattern : AP లో కొత్త రూల్.. పరీక్షల విధానంలో మార్పులు..
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ వివరాలను నిన్న విడుదల కూడా చేసిందని తెలిపారు. బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం… విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Delhi Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోడీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడంలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యమని ఆరోపించారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయిందని తెలిపారు. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!