NTV Telugu Site icon

Revanth Reddy: 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నామినేషన్ వేయను..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి సంపత్ హయాంలో జరిగిందేనని ఆయన అన్నారు. తుమ్మిళ్లను కట్టే వరకు కొట్లాడింది సంపత్ అంటూ పేర్కొన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు.

Also Read: CM KCR: సింగరేణిని ముంచింది కాంగ్రెస్సే.. ప్రజలు విచక్షణతో ఓటేయాలి..

పగవాడు ఉన్నా ఆ గుడి పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్‌కు చీము నెత్తురు ఉంటే.. 3గంటల కరెంటు ఇస్తామన్నామని కాంగ్రెస్ ఎక్కడ చెప్పిందో నిరూపించాలన్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌ది అని పేర్కొన్నారు. 24 గంటల కరెంట్ అని కేసీఆర్ చెబుతున్నారని.. నేను సూటిగాసవాల్ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్ స్టేషన్ కైనా వెళదామని, నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే తాను, సంపత్ నామినేషన్ వేయమని సవాల్ విసిరారు. లేకపోతే నడిగడ్డలో మీరు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. దొరగారి దొడ్లో జీతగాడిగా బతకడమేనా వెంకట్ రామిరెడ్డి ఆత్మగౌరవమా అంటూ ప్రశ్నించారు. ఇదేనా నడిగడ్డ పౌరుషం… ఒకసారి ఆలోచించాలని కోరుతున్నానన్నారు.

Also Read: Nama Nageswara Rao : రైతుల ఆత్మహత్యలు పెరిగిందే కాంగ్రెస్ పాలనలో

రేవంత్‌ మాట్లాడుతూ.. ‘మీ బిడ్డగా చెబుతున్నా అధికారంలోకి రాగానే బోయలకు ఎమ్మెల్సీ ఇస్తాం. నల్లమల్ల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాది. ఇది మన పాలమూరు బిడ్డల జీవన్మరణ సమస్య… ఆత్మగౌరవ సమస్య. కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ను చంపేందుకు భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి. ధరణి లేకపోయినా వైఎస్ హయాంలో రైతులకు ఆర్ధిక సాయం అందలేదా? ధరణి స్థానంలో మెరుగైన సాంకేతికతతో కొత్త యాప్ తీసుకొస్తాం… రైతుల భూములు కాపాడుతాం. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.” అని రేవంత్‌ అన్నారు.

 

Show comments