Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఈ తరహా అంశాలను కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని ముందుగానే మీడియాకు వెల్లడి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశంపై వేరొకరు మాట్లాడడం అనవసరమైన మాట్లాడ్డం ఏంటని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు.
Read Also: Love Scam : ప్రేమన్నాడు.. పెళ్లాన్నాడు.. 15 లక్షలు బిల్లేశాడు.. ఇక్కడే అసలు ట్విస్ట్..!
అంతేకాదు, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అలాంటి సున్నితమైన విషయాలను మీడియా ముందుకు తీసుకురావడం పట్ల పార్టీ అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసింది. ఈ తరహా ప్రకటనలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నందున పార్టీతో సంప్రదించకుండా ఏ విధమైన ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ చీఫ్ మంత్రులకు సూచించారు.
Read Also: KTR : రాజకీయంగా వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారా..? కేటీఆర్ సంధించిన ప్రశ్నలు ఇవే..!
ప్రతి మంత్రి తమ శాఖ పరిధిలోని అంశాల పట్ల మాత్రమే స్పందించాలని, కోర్టు పరిధిలో ఉన్న విషయాలపై మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని టీపీసీసీ చీఫ్ ప్రభుత్వ మంత్రులను కోరారు.
