Site icon NTV Telugu

Mahesh Kumar Goud: టైమ్, డేట్ ఫిక్స్ చేయండి.. ఎక్కడికి రమ్మన్నా వస్తా.. కేసీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షుడు సవాల్!

Tpcc Chief, Mahesh Kumar Goud

Tpcc Chief, Mahesh Kumar Goud

బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి.. చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? అంటూ సవాల్ విసిరారు. రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉన్నాయని.. సభలో అసలు మహిళలే కనిపించడం లేదన్నారు. వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగంలో పసలేదు.. ఆయన శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని.. నకిలీ గాంధీలు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అని మండిపడ్డారు.. కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి నిదర్శనం బీజేపీపై కేసీఆర్ రెండు నిమిషాల ప్రసంగమని ఆరోపించారు.

READ MORE: BSNL Recharge: కేవలం రూ.127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటా..!

బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పింఛంతో కొట్టినట్లు ఉందని.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని మహేష్‌ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బిక్షతో ముఖ్యమంత్రి అయ్యావు అంటూ కేసీఆర్‌ను విమర్శించారు. “గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో దొంగ పాస్ పోర్టుల బిజినెస్ చేసుకునే మీ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కేసిఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. పదేళ్లలో మీరు 60 వేల ఉద్యోగాలు ఇస్తే. మేము ఏడాదిలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసిఆర్ కి గుండెల్లో గుబులు మొదలైంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆడుతున్న మూడు ముక్కల ఆటతో కేసీఆర్‌కి మతి భ్రమించింది.” అని బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

READ MORE: MRK Panneerselvam: టీవీకే చీఫ్ విజయ్ బ్లాక్లో టికెట్లు అమ్మాడు.. అవినీతిపై మాట్లాడే హక్కు లేదు..

Exit mobile version