Mahesh Kumar Goud: బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.. ఓట్ చోరీ నీ నిరసిస్తూ గాంధీ భవన్ ముందు యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలన్నారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్య వంతం చేసే విధముగా ఉందని కొనియాడారు. ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓటు విలువ తెలియక ఉండటం శోచనీయమన్నారు. బీహార్ ఎన్నికల్లో సామాన్యులకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఓటు శాతం తక్కువగా వచ్చి ఎన్డీయే సీట్లు గెలవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీహార్‌లో ఓట్ చోరీతో ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చాయని ఆరోపించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీహార్ లో ఎన్డీయే కూటమికి సీట్లు గెలుచుకుందన్నారు. దేశ భవిష్యత్ కి విఘాతం కలిగించే విధంగా ఓట్ చోరీ ఉందన్నారు.
READ MORE: INDIA Bloc: బీహార్ ఎఫెక్ట్.. తెరపైకి కొత్త డిమాండ్
ఓట్ శతం మహాఘాట్ బంధన్ కి ఎక్కువ వస్తే.. సీట్లు ఎన్డీయే కూటమికి సీట్లు పెరిగాయని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.”సెక్యులర్ ఓట్లను తొలగించారు.. ఓట్ చోరీ తో రాజ్యాంగానికి తూట్లు.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరు తెన్నులు శోచనీయం.. BJYM లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని చేస్తుంది. దేశం బాగుపడాలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉంది.. అధికారం పరమావధిగా మోడీ అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారు.. బీహార్ ఎన్డీయే కూటమి గెలుపు అప్రజాస్వామికం.. ఓట్ చోరీ గురించి 8 ఏళ్ల క్రితమే పోరాడాం.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫ్రంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది.. రేపటి నుంచి తెలంగాణలో ఓట్ చోరీ సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుంది.. తెలంగాణలో సర్ పేరిట ఓట్లు తొలగించే ప్రమాదం పొంచి ఉంది..” అని టీపీసీసీ ఛీప్ వ్యాఖ్యానించారు.
READ MORE: MLA Wife Digital Arrest Scam: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ కేసును ఛేదించిన పోలీసులు..