NTV Telugu Site icon

TPCC Cheif Mahesh Goud : కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా..

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోట్‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తా అని, పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతున్నా అని ఆయన అన్నారు. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా అని ఆయన వెల్లడించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని ఆయన తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులపై ఎక్కువ బాధ్యత ఉందని మహేష్‌ కుమార్ గౌడ్‌ అన్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలను గెలవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని, కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యమన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Gaza War: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు మృతి

అంతేకాకుండా..’నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో మమేకమై పనిచేశాం.. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేద్దాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలి… కేసీఆర్ అబద్దాలతో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు.. కేసీఆర్ పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయాడు..రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆశాకిరణం… రాహుల్ ను ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలి.. ప్రధాని మోదీకి భవిష్యత్తు లేదు.. కులం,మతం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.. వారిని చైతన్యపరచాలి.. రాహుల్ గాంధీతో చేయి కలిపి ముందుకు సాగాలి… ఎస్సీ,ఎస్టీ, బీసీ లు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు… తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులు ఎప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఉంటాయి… కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకు వెళ్తా… రెండోసారీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది…’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Viral Wedding Card: ఐడియా అదుర్స్ గురూ.. “ఆపిల్ మ్యాక్ బుక్ పెళ్లి పత్రిక”.. వీడియో వైరల్