NTV Telugu Site icon

Toxic : గ్లింప్స్ తోనే నెంబర్ వన్ రికార్డ్ నమోదు చేసిన ‘టాక్సిక్’

Toxic

Toxic

Toxic : ‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు యష్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రానుంది. మలయాళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న గీతూ మోహన్ దాస్ ఈ ‘టాక్సిక్’ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి యష్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. జనవరి 8న 10 గంటల 25 నిమిషాలకి సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Read Also:Balmuri Venkat: కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది..

ఈ గ్లింప్స్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఈ స్థాయిలో రెస్పాన్స్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. టాక్సిక్ గ్లింప్స్‌కు వచ్చిన ఆదరణ యష్ పై అభిమానుల అంచనాలను మరోమారు ఖరారు చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: వేర్ ఈజ్ పుష్ప కూడా గతంలో భారీ వ్యూస్ సాధించింది. హిందీ వెర్షన్ విడుదలైనప్పుడే 27.67 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా 20.45 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ ఒక్క గ్లింప్స్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. కానీ గ్లింప్స్ లో ఉన్న కంటెంట్ మాత్రం సినిమాలో హైలెట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Read Also:CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్‌.. వారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు..

జూనియర్ ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ కూడా తెలుగు వెర్షన్ 26.17 మిలియన్ల వ్యూస్ అందుకోగా, హిందీ వెర్షన్ 18.57 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం గ్లింప్స్ కూడా 24 గంటల్లో 20.98 మిలియన్ల వ్యూస్ సాధించి మరో రికార్డుని క్రియేట్ చేసింది. సూర్య కంగువ సినిమా గ్లింప్స్ కూడా 20.77 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ గ్లింప్స్ రికార్డులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్ ను చూపిస్తున్నాయి.

Show comments