Toxic Gas Leak: హెట్రో డ్రగ్స్ విషవాయువు లీక్ ఘటనలో నిలకడగా బాధితుల ఆరోగ్యం
- జిల్లా నక్కపల్లి మండలం హెట్రో డ్రగ్స్ పరిశ్రమలో విషవాయువు లీక్
- మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఘటన.
- విష వాయువు ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన 12 మంది కార్మికులు.
- ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Gas Leak: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెట్రో డ్రగ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువు లీక్ అవడంతో తీవ్ర కలకలం రేగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పరిశ్రమలోని 9వ యూనిట్ హెచ్ 7 బ్లాక్‌లో కెమిస్టులు పనిచేస్తుండగా, ఓ పైపు నుంచి ప్రమాదవశాత్తూ విష వాయువు లీకైంది. వాయువు లీక్ కారణంగా సమీపంలో ఉన్న 12 మంది కార్మికులు కళ్లు మంట, గొంతు నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పరిశ్రమ భద్రత సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను అంబులెన్స్‌ల్లో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష వాయువు ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మిగతా 9 మంది నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు.
Also Read: Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
విష వాయువు లీక్ సమయంలో కార్మికులు భయంతో పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా ఇటువంటి ప్రమాదాలు జరగడంతో ఫార్మా కంపెనీల భద్రతాపరమైన చర్యలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తర్వాత హెట్రో డ్రగ్స్‌లో ఈ విష వాయువు లీక్‌పై రెవెన్యూ, పోలీస్ శాఖలు విచారణ చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు పరిశ్రమ భద్రతా నిబంధనలపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం 12 మంది కార్మికుల ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!