NTV Telugu Site icon

Delhi AQI: ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి నాణ్యత

Delhi Aqi

Delhi Aqi

ఢిల్లీలో గాలి నాణ్యత విషపూరితంగా మారుతుంది. దీపావళికి ముందు దేశ రాజధానిలోని ఏ ప్రాంతం కూడా పీల్చడానికి సరిపోవడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (గురువారం) ఉదయం గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్‌పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్‌లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 432, ఆర్‌కె పురంలో 453, పంజాబీ బాగ్‌లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆ తర్వాత వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

Read Also: Viral Video: ఆహా రాళ్ల మధ్యలో ఏం చక్కగా నిద్రపోతుందో ఈ కోతి

ఢిల్లీ ఏక్యూఐ నిన్న (బుధవారం) వరుసగా ఆరో రోజు కూడా గాలిలో నాణ్యత కోల్పోవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 కంటే ఎక్కువ నమోదైంది అని చెప్పుకొచ్చారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కూడా ఇందులో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించడం లేదు.. గాలి వేగం స్వల్పంగా పెరగడం, దిశ మారడం వల్ల మంగళవారం కాలుష్య స్థాయిలు స్వల్పంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది. అయితే బుధవారం మళ్లీ పెరిగింది. ఢిల్లీ ఏక్యూఐ బుధవారం 426గా ఉంది.

Read Also: Supreme Court Collegium: సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదం

ఇక, మంగళవారం 395గా నమోదు అయింది. 24 గంటల్లోనే 31 పాయింట్లు పెరిగింది. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాలలో మాత్రమే ఇండెక్స్ 400 కంటే తక్కువగా ఉంది. కానీ ఇక్కడ గాలి కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం.. వచ్చే రెండు రోజుల్లో గాలి సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని చెప్పారు. గాలి వీస్తున్నప్పుడు దాని వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుందన్నారు. దీని కారణంగా ఇవాళ కూడా గాలిలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. రాబోయే ఆరు రోజులలో గాలి నాణ్యతలో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. ఢిల్లీలో గాలి కాలుష్యంపై నాసా

ఢిల్లీలో గాలి న్యాణ్యత ప్రమాణాలు:
ఐటీఓ-459
పంజాబీ బాగ్-464
నెహ్రూ నగర్-456
సోనియా విహార్-444
జహంగీర్‌పురి-453
NCR నగరాల- AQI
ఫరీదాబాద్ – 425
ఘజియాబాద్ – 384
గ్రేటర్ నోయిడా – 478
నోయిడా – 405
గురుగ్రామ్ – 385