ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ (గురువారం ) 28వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరాజయం పాలైంది. ఇంత వరకూ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
Also Read : Karimnagar: అనుమానాస్పద మృతిని చేధించిన జమ్మికుంట పోలీసులు..
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్ మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించడం లేదు.. అటు ఢిల్లీ క్యాపిటల్స్ లో కూడా డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇవ్వడం లేదు. సొంత మైదానంలో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం ఈ మ్యాచ్ లో నైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.. కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆటగాళ్లు పెవిలియన్ కే పరిమితం అయ్యారు.
Also Read : RCB vs PBKS : ఆర్సీబీ ఘన విజయం.. 150 పరుగులకే పంజాబ్ ఆలౌట్
అయితే ఈ పిచ్ భారీ స్కోర్ చేసేందుకు అనువుగా ఉంది. ఇది కొంచెం పొడి వాతావరణం కలిగి ఉంటుంది. పెద్ద మొత్తంలో స్పిన్ కు అనుకూలిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన వారికి ఇది మరింత ఎక్కువ స్వింగ్ అవుతుంది. బ్యాటర్లు ఆ పరిస్థితులను అధిగమించిన తర్వాత, వారు పెద్ద స్కోరు చేయగలరు అని క్యూరేటర్ వెల్లడించారు.