Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Toshiba Ttdi Investment In Telangana Rudraram Factory Mou

Toshiba : రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ.. రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

Published Date :April 18, 2025 , 7:06 pm
By Gogikar Sai Krishna
Toshiba : రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ.. రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Toshiba : తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ కు రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది.

టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరివర్తనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు. పరిశ్రమల భాగస్వామ్యాలు, వ్యూహాత్మక సహకారాలతో అన్ని రంగాల్లో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని అన్నారు. కొత్త పెట్టుబడులకు తోషిబా చేసుకున్న ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహమిస్తుందని అన్నారు.

టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. కొత్త ఆవిష్కరణల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత తెలంగాణను పెట్టుబడుల గమస్య్థానంగా మార్చుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంతో ఉన్నట్లు చెప్పారు.

NTT Data-Neisa : హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Electricity Sector
  • Power Transformers
  • revanth reddy
  • Rudraram Factory
  • Surge Arresters

తాజావార్తలు

  • Ram Charan: పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం!

  • Big Tax Reforms: ఫైనాన్స్‌ బిల్లులో 53 సవరణలు..!

  • Fuel Shortage: “అందుకే బంకుల్లో స్టాక్ ఖాళీ అవుతోంది”.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ బిగ్ వార్నింగ్

  • Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 SE 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 5520mAh బ్యాటరీ & 108MP కెమెరా

  • IPL Owners List 2026: 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో తెలుసా?.. ఫ్రాంచైజీల వెనుక ఉన్న పెద్ద పేర్లు ఇవే!

ట్రెండింగ్‌

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions