Site icon NTV Telugu

America: మంచుతో అమెరికా గజ గజ .. తరానికి ఒక్కసారేనట!

America

America

America: అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకింది. దీంతో కాలిఫోర్నియాలో భారీహా మంచు కురుస్తోంది. మంచు భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వేలాది ఇళ్లు చీకటిలోనే ఉన్నాయి. మంచు కురవడం వల్ల డల్లాస్‌కు వచ్చే వందల కొద్దీ విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. డల్లాస్‌ను టోర్నడో తాకే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్‌ రాష్ట్రంలో దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని జాతీయ వాతావరణ సేవల సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. డల్లాస్ సమీపంలో తీవ్రమైన గాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర డల్లాస్ ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. అమెరికా రూట్‌ 75లో వాహనాలు భారీగా బోల్తాపడ్డాయి.

Read Also: Global Investors Summit 2023: సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..

లూసియానా స్టేట్‌ యూనివర్శిటీని టోర్నడో తాకింది. టెక్సాస్‌లో 3,46,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియాలో దాదాపు 7 అడుగుల మేర హిమపాతం సంభవించింది. ఈ స్థాయి మంచు.. తరానికి ఒక్కసారి మాత్రమే చూడగమలని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో కొన్నాళ్ల నుంచి నెలకొన్న కరవు పరిస్థితులు ఈ తుపాను దెబ్బకు కొంత తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మంచు తుపాను నేపథ్యంలో ప్రజలు చలికి వణికిపోతున్నారు.

Exit mobile version