Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines At 1pm On 17th December 2024

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Published Date :December 17, 2024 , 1:13 pm
By Sampath Kumar
Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే దాడులు:
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు:
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.

ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది:
రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి హైదరాబాద్ లో గ్లోబల్ సమీట్ నిర్వహించామన్నారు. అంతర్జాతీయ సంస్థలన్నీ తీసుకురావడంతో పాటు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని తెలిపారు. ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐటీ ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. స్కిల్స్ ఉన్న వారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షలకు ఐటీ ఎగుమతులు చేరాయని మండలిలో మంత్రి శ్రీధ్ తెలిపారు. ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ ఎక్కడికి పోలేదు రాష్ట్రంలోనే ఉందన్నారు. త్వరలోనే ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. టీఎస్ ప్రైడ్ యధావిధిగా కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.

గుమ్మడికాయ దొంగ అంటే:
గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై శాసన మండలిలో మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. జరుగుతున్న ఘటనలపై మాకు అనుమానాలు ఉన్నాయి.. బయటకు తీస్తామన్నారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే టిఆర్ఎస్ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు.. టిఆర్ఎస్ వాళ్ళ లాగా యాక్టింగ్ రాదన్నారు. బీఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే నిలువెల్లా అహంకారమే కనిపిస్తోందని తెలిపారు. ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచాం, 16 ఏండ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచామన్నారు.

జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ:
జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించడమేనని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న చర్యలు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. తక్షణమే జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సభ్యులైన సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

లోక్‌సభలో ‘జమిలి’ బిల్లు:
నేడు లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ” ఒకే దేశం, ఒకే ఎన్నికల ” బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లోక్‌సభలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లు’పై చర్చ జరుగుతోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి. లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. జమిలి బిల్లు గట్టెక్కాలంటే లోక్‌సభలో (542) అంటే 2/3 మెజారిటీ అవసరం. ఇకపోతే, ఎన్‌డీఏ బలం 293 కాగా.. ఇండియా బలం 234. జమిలి బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

డెకాయిట్ హీరోయిన్ ఎవరంటే:
అడివి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాను ప్రకటించి చాలా కాలం కావొస్తుంది. అప్పట్లో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. కానీ ఎందుకనో గత కొన్ని నెలలుగా ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమా నుండి శ్రుతి హాసన్‌ వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి కానీ అధికారకంగా ప్రకటించలేదు. ఆమెను తొలగించి మృణాల్ ను తీసుకున్నారు అని వార్తలు వినవచ్చాయి. కాగా నేడు ఈ సినిమా నుండి చిత్ర హీరో అడివి శేష్ బర్త్ డే కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో అడివి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ ల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ అధికారకంగా రిలీజ్ చేసారు.

సంచలన లేఖ విడుదల చేసిన మంచు నిర్మల:
మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో అయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేసారు. ఆ లేఖలో నిర్మల ” డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయినవిష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు.దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు తెలిసింది.

భారీ తేడాతో న్యూజిలాండ్ విజయం:
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్‌లో చివరిది. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ 423 పరుగుల తేడా విజయంతో టెస్టు మ్యాచ్‌లో అతిపెద్ద విజయం సాధించింది. సిరీస్ మొత్తం అత్యుత్తమ ప్రదర్శన చూపించిన హ్యారీ బ్రూక్ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును అందుకోగా, మిచెల్ సాంట్నర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • ntv news
  • telangana news
  • Top Headlines @1PM

తాజావార్తలు

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

  • Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions