బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే దాడులు:
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు:
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.
ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది:
రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి హైదరాబాద్ లో గ్లోబల్ సమీట్ నిర్వహించామన్నారు. అంతర్జాతీయ సంస్థలన్నీ తీసుకురావడంతో పాటు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని తెలిపారు. ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐటీ ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. స్కిల్స్ ఉన్న వారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షలకు ఐటీ ఎగుమతులు చేరాయని మండలిలో మంత్రి శ్రీధ్ తెలిపారు. ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ ఎక్కడికి పోలేదు రాష్ట్రంలోనే ఉందన్నారు. త్వరలోనే ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. టీఎస్ ప్రైడ్ యధావిధిగా కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.
గుమ్మడికాయ దొంగ అంటే:
గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై శాసన మండలిలో మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. జరుగుతున్న ఘటనలపై మాకు అనుమానాలు ఉన్నాయి.. బయటకు తీస్తామన్నారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే టిఆర్ఎస్ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు.. టిఆర్ఎస్ వాళ్ళ లాగా యాక్టింగ్ రాదన్నారు. బీఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే నిలువెల్లా అహంకారమే కనిపిస్తోందని తెలిపారు. ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచాం, 16 ఏండ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచామన్నారు.
జమిలి ఎన్నికల బిల్లుపై రచ్చ రచ్చ:
జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించడమేనని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న చర్యలు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. తక్షణమే జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సభ్యులైన సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ఉపసంహరించుకోవాలని సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
లోక్‌సభలో ‘జమిలి’ బిల్లు:
నేడు లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ” ఒకే దేశం, ఒకే ఎన్నికల ” బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం లోక్‌సభలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లు’పై చర్చ జరుగుతోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి. లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. జమిలి బిల్లు గట్టెక్కాలంటే లోక్‌సభలో (542) అంటే 2/3 మెజారిటీ అవసరం. ఇకపోతే, ఎన్‌డీఏ బలం 293 కాగా.. ఇండియా బలం 234. జమిలి బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
డెకాయిట్ హీరోయిన్ ఎవరంటే:
అడివి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాను ప్రకటించి చాలా కాలం కావొస్తుంది. అప్పట్లో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. కానీ ఎందుకనో గత కొన్ని నెలలుగా ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమా నుండి శ్రుతి హాసన్ వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి కానీ అధికారకంగా ప్రకటించలేదు. ఆమెను తొలగించి మృణాల్ ను తీసుకున్నారు అని వార్తలు వినవచ్చాయి. కాగా నేడు ఈ సినిమా నుండి చిత్ర హీరో అడివి శేష్ బర్త్ డే కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో అడివి శేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ ల ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తూ అధికారకంగా రిలీజ్ చేసారు.
సంచలన లేఖ విడుదల చేసిన మంచు నిర్మల:
మంచు మనోజ్ ఇంట్లోని జనరేటర్ లో మంచు విష్ణు చక్కెర పోసాడని ఆరోపిస్తూ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే మంచు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో అయన తల్లి మంచు నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజగా లేఖ విడుదల చేసారు. ఆ లేఖలో నిర్మల ” డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయినవిష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు.దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు తెలిసింది.
భారీ తేడాతో న్యూజిలాండ్ విజయం:
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్‌లో చివరిది. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ 423 పరుగుల తేడా విజయంతో టెస్టు మ్యాచ్‌లో అతిపెద్ద విజయం సాధించింది. సిరీస్ మొత్తం అత్యుత్తమ ప్రదర్శన చూపించిన హ్యారీ బ్రూక్ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును అందుకోగా, మిచెల్ సాంట్నర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనకు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నాడు.