NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి.. కానిస్టేబుల్ వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం నుంచి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. నేడు కూడా కొనసాగింది. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. దీంతో పాటు డీఎస్పీ, ఏఎస్‌ఐకి గాయాలయ్యాయి. హెడ్‌ కానిస్టేబుల్‌ హెచ్‌సీ బషీర్‌ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్‌ డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ సంతాపం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వీర పోలీసు కుటుంబానికి మొత్తం పోలీసు బలగాలు అండగా నిలుస్తున్నాయని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పోలీసు దళం హెచ్‌సి బషీర్‌ను తిరిగి తీసుకురాలేనప్పటికీ, కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, తన వర్గాన్ని, దేశ ప్రజలను రక్షించడానికి బషీర్ కృషిచేసినట్లు తెలిపారు. తన ఆయుధంతో స్వయంగా విదేశీ ఉగ్రవాదిని హతమార్చిన ధైర్యవంతుడు బషీర్ అని కొనియాడారు. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇవాళ 33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దని, కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తహశీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములను కాపాడటంలో రెవెన్యూ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు పొంగులేటి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.. టీడీపీ మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంటామని ప్రకటించాలని అన్నారు.

ఆస్తి పంపకాలు పంచాయతీ.. తండ్రిపై కొడుకు దాడి.. మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఆస్తి పంపకాలు చేసుకుందామని పంచాయతీ పెట్టించి, పంచాయతీలో ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానై ఆగ్రహం పట్టలేని కొడుకులు కన్న తండ్రి పై, అతని రెండో భార్యపై కత్తులతో దాడి చేయగా ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన మల్లయ్యకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య బాలవ్వ కు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు, రెండో భార్య పద్మకు కూడా ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మొదటి భార్య చనిపోవడంతో మల్లయ్య గత కొన్ని రోజులుగా రెండో భార్య పద్మతో ఉంటుండగా, పలుమార్లు మొదటి భార్య కొడుకు, కుటుంబ సభ్యులు కలిసి ఆస్తి పంపకాలు చేయాలని గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరుగుతున్న క్రమంలో మల్లయ్య, అతని రెండో భార్య పద్మ పై బాలవ్వ కొడుకు రాజ్ కుమార్ అల్లుళ్లు బిడ్డలు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేయగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. మల్లయ్య మార్గమధ్యంలో మరణించగా, పద్మ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సోనియా ఆకులు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం నాలుగో వారాంతానికి చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు 11 మందితో షో నడుస్తోంది. ఇప్పుడు నాలుగో వారం పూర్తికావడంతో ఈ రోజు నాగార్జున ఎవరిని ఇంటికి పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లైన్లు ముగియడంతో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వారం ఎలిమినేషన్‌పై పూర్తి క్లారిటీ రానుంది. కాగా.. ఇందులో సోనియా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు. సామాన్య భక్తులకు ఈ ఉత్సవాలలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. 120 సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షిస్తుంటారు‌.. కంట్రోల్ రూం నుంచి ఇదంతా కంట్రోల్ చేస్తారని అన్నారు. వీవీఐపీల దర్శనాలు 8 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటాయని మంత్రి చెప్పారు. ఏ దర్శనం క్యూలైన్ వీవీఐపీల దర్శనాల సమయంలో ఆపడం జరగదన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు దర్శనం ఉంటుందన్నారు. బంగారు వాకిలి వరకే దర్శనం… అంతరాలయ దర్శనం లేదని తెలిపారు.

ఆస్తి పంపకాలు పంచాయతీ.. తండ్రిపై కొడుకు దాడి.. మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఆస్తి పంపకాలు చేసుకుందామని పంచాయతీ పెట్టించి, పంచాయతీలో ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానై ఆగ్రహం పట్టలేని కొడుకులు కన్న తండ్రి పై, అతని రెండో భార్యపై కత్తులతో దాడి చేయగా ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన మల్లయ్యకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య బాలవ్వ కు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు, రెండో భార్య పద్మకు కూడా ఒక్క కొడుకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మొదటి భార్య చనిపోవడంతో మల్లయ్య గత కొన్ని రోజులుగా రెండో భార్య పద్మతో ఉంటుండగా, పలుమార్లు మొదటి భార్య కొడుకు, కుటుంబ సభ్యులు కలిసి ఆస్తి పంపకాలు చేయాలని గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరుగుతున్న క్రమంలో మల్లయ్య, అతని రెండో భార్య పద్మ పై బాలవ్వ కొడుకు రాజ్ కుమార్ అల్లుళ్లు బిడ్డలు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేయగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. మల్లయ్య మార్గమధ్యంలో మరణించగా, పద్మ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ప్రాచీన మానవుడు రాతి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన పాండవుల గుట్టను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం పాండవుల గుట్టను పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ ఖరేతో కలిసి సందర్శించిన కలెక్టర్.. పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు, రోడ్లు, పార్కింగ్, రిసార్ట్‌లు తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాండవుల గుట్టతో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పాండవుల గుట్టకు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించేందుకు కృషి చేస్తామని, గైడ్ సేవలు, ట్రెక్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేక ప్యాకేజీలో చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. పాండవుల గుట్ట వద్ద ఇప్పటికే ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్‌లు జరుగుతున్నాయని తెలిపారు.

మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ట్రైలర్‌ చూసేయండి

మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌” చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్డ్ చేశారు. ఆమె పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రవితేజ ఇండస్ట్రీలో ఎంతోమందిని ఎంకరేజ్ చేశారని గుర్తుచేశారు. తనను కూడా ఆయనే ప్రోత్సహించినట్లు తెలిపాడు. అందుకే మాధవ్ ను సపోర్ట్ చేయడం తన బాధ్యతగా భావించానన్నాడు. కాగా.. పెదనాన్న సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని “మిస్టర్ ఇడియ‌ట్‌” చిత్రంహీరో మాధవ్ అన్నారు. ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కొంత సమయం పట్టిందన్నాడు. తాము శాటిస్వై అయిన తర్వాతే రిలీజ్ చేస్తామని భావించినట్లు తెలిపాడు. తన పెదనాన్న లాగానే తనను కూడా ఆదరించాలని కోరారు.