NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్..

ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులో ఇరాన్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో తేలికపాటి వార్‌హెడ్‌లను ఉపయోగించాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికన్ నిపుణులు విశ్లేషించారు. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్‌కి చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలపై దాడులు చేసినట్లు చెప్పారు.

ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని పర్చిన్ అనే భారీ సైనిక సముదాయంపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ఖోజీర్ ప్రాంతంలో కూడా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఈ ప్రాంతంలో ఇరాన్ అత్యంత విశాలమైన క్షిపణి ఉత్పత్తి వ్యవస్థ ఉందని చెబుతున్నారు. ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. ఇజ్రాయిల్ తన దాడులకు ముందు ఇలామ్, ఖుజేస్తాన్, టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోని సరిహద్దు రాడార్ వ్యవస్థలపై దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది.

కివీస్‌పై ఓటమి.. గంభీర్ కీలక నిర్ణయం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో.. భారత్‌ సిరీస్‌ కోల్పోయింది. అంతేకాకుండా.. సొంతగడ్డపై టెస్టుల్లో వరుసగా 18 సిరీస్‌ల విజయాల భారత్‌ విజయోత్సవ ప్రచారానికి తెరపడింది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు. మిగతా పది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా.. గల్లంతైన వారి కోసం మెరైన్, ఎస్ రాయవరం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్ళు, స్థానిక మత్స్యకారులు సహకారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కొరుప్రోలో ఒక వివాహానికి హాజరై ఈరోజు స్నానాల కోసమని రేవుపోలవరం సముద్రతీరానికి వచ్చారు. స్నానానికి సముద్రంలో దిగగా కెరటాలు తాకిడికి గల్లంతయ్యారు.

రైతుబంధు ఇవ్వడంలేదు.. రైతుబంధు ఉందో, లేదో తెలియదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది పూర్తిగా పాలన గాడి తప్పింది ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన అంశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అనేక ప్రగల్బాలు పలికి గద్దేనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసారని, 10నెలల కాంగ్రెస్ 10ఏళ్ల బీఆరెస్ పాలన దొందు దొందే రెండు పార్టీల పాలన ఒక్కటే అని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు రెంట్​ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్​ ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్​ పరిస్థితి ఉందన్నారు. రూ. 5, రూ. 10 లక్షల కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేని, వీధి లైట్లు సరిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని, కొత్త వీధిలైట్లను నిధులివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉందన్నారు. రూ. 2500 మహిళలకు హామీ రాలేదని, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇవ్వలేదన్నారు కిషన్‌ రెడ్డి. కాలేజీ విద్యార్థులకు స్కూటీలు సంస్థలకు ఆర్డర్​ ఇవ్వలేదని, వితంతు, విద్యార్థులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పెన్షన్​ పెంచలేదని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ఇస్తున్న రూ. 5 లక్షల భరోసా కార్డు, యువతకు నిరుద్యోగ భృతి సీఎం ఆలోచన చేయలేదన్నారు.

26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు..

ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు. ముంబైలో జరిగిన సంఘటన మళ్లీ జరగకూడదని ఆయన అన్నారు. ముంబై అనేది ఉగ్రవాద వ్యతిరేక చిహ్నం అని మంత్రి చెప్పారు. మహారాష్ట్రలోని పూణేలో ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రెసెంట్ గ్లోబర్ సినారియో’’ అనే కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పొలిటికల్‌గా చూసుకోవాలి కానీ.. వ్యక్తిగతంగా వెళ్తున్నారు

నిన్న రాజ్ పాకాల సొంత ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసిన సందర్భం అని, 2, 3 రోజుల్లో ఒక రోజు వెజ్, మరో రోజు నాన్ వెజ్ లతో వంటలతో ప్రోగ్రాంలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదని, అక్కడ పోలీసులు దాడులు చేశారన్నారు. ఉండాల్సిన దాని కన్నా 4 బాటిల్ లు ఎక్కువగా ఉన్నాయి అని తెల్సిందని, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ లో దొరికితే గచ్చిబౌలి ఇంటి దగ్గర ఎందుకు హంగామా చేస్తున్నారని, కేటీఆర్ బామ్మర్ది కాబట్టి ఇంత ఎక్కువ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దసరా దీపావళి పండుగ లకు దవాత్ లు చేసుకోవడం కామన్ అని, ప్రపంచం బద్దలు అయి పోయింది అనే విధంగా చేస్తున్నారన్నారు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఒక్కరికి డ్రగ్స్ తీసుకున్నట్లు గా పాజిటివ్ వచ్చింది అని చూసానని, దానిని అందరికి అంట కడితే ఎలా.. అని ఆయన ప్రశ్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా బలవంతంగా ఇండ్ల మీదకు ఎందుకు పోతున్నారని, దీని వెనుక బలమైన కుట్రకోణం కనిపిస్తుందన్నారు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. పొలిటికల్ చూసుకోవాలి కాని.. వ్యక్తిగతంగా వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

దళపతి విజయ్‌కి ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు..

తమిళ స్టార్ దళపతి విజయ్‌కి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తన పార్టీ తమిళ్ వెట్రి కజగం(టీవీకే) మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ‘‘విజయ్ చాలా ఏళ్లుగా స్నేహితుడు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. నా ప్రొడక్షన్ హౌస్‌‌లో మొదటి సినిమా అతడిదే. అతను సన్నిహిత స్నేహితుడిగా ఉన్నాడు. విజయ్ రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.

తమిళనాడు విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఈ రోజు టీవీకే ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీని స్థాపించిన 8 నెలల తర్వాత తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఇటేవలే ఆయన టీవీకే జెండాను ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్రానికి సంబంధించి విజయ్ తన రాజకీయ ఎజెండాను ప్రకటించాల్సి ఉంది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు పోస్టింగులు.. ఆమ్రపాలి పోస్ట్ ఇదే

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన పలువురు ఐఏఎస్‌ (IAS)లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అందులో.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనరుగా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శి (GPM & PR)గా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించింది. అయితే.. తెలంగాణ నుంచి వచ్చిన మరో ఐఏఎస్ రోనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా.. అంతకుముందు ఐఏఎస్ ప్రశాంతికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. అటవీ, పర్యావరణశాఖ అదనపు కార్యదర్శిగా నియమించారు.

విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు..

ఈ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా విమానయాన సంస్థలు, హోటళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఇప్పటికే ఏపీలోని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో వరుస బెదిరింపు కాల్స్​ వస్తున్నాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా బాంబు కాల్స్ మొదలయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.

విజయ్ ఎవడికి భయపడడు.. తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్‌ స్పీచ్‌

తమిళ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో జరిగిన ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయ్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌ ఇచ్చారు. 2026 ఎన్నికల్లో సింగిల్‌గానే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని విజయ్ తెలిపారు. కానీ.. తమతో పాటు ఎవరైనా రావడానికి వస్తే మాత్రం కచ్చితంగా కలిసే వారితో పాటు ఎన్నికలకు వెళ్తామని అన్నారు. విజయ్ ఎవడికి భయపడడు.. ఎవరెవరి పేర్లు చెప్పుకొని రాజకీయం చేయాల్సిన అవసరం విజయ్‌కు లేదన్నారు. రాజకీయాల్లో ఒక మంచి పార్టీగా గుర్తింపు పొందడానికి తాను పనిచేస్తానని తెలిపారు. కుట్రలు చేయడానికి, చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడటానికి, బూతులు తిట్టుకోవడానికి తాను రాజకీయ పార్టీ పెట్టలేదని పేర్కొన్నారు. సిద్ధాంతాల పరంగాను, ఐడియాలజీ పరంగాను ఎవరైనా తనతో విభజించవచ్చు.. కుట్రలో చేయొచ్చని విజయ్ అన్నారు. అలాంటి వారితో డీసెంట్ అప్రోచ్, డీసెంట్ ఎటాక్ ఉంటుందని తెలిపారు. అది మాత్రం చాలా లోతుగానే చేస్తామని చెప్పారు. డబ్బులు దోచుకోవడానికి అధికారాన్ని అడ్డగోలుగా వాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజల కోసం ప్రజల కోరిక మేరకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఒక ఆశయం కోసం పక్క ప్లాన్ తో వచ్చాను‌‌‌.‌.. ఇక వెనక్కి వెనక్కి తిరిగి చూసేది లేదని విజయ్ పేర్కొన్నారు.

Talasani Srinivas Yadav : పొలిటికల్‌గా చూసుకోవాలి కానీ.. వ్యక్తిగతంగా వెళ్తున్నారు