NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

జిల్లాల్లో సీఎం పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లు ఏర్పాటు

ఏపీలో జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో సభ్యులుగా ఆరుగురు అధికారులను నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో అడ్వాన్స్ టీమ్‌లు నియామకమయ్యాయి. అడ్వాన్స్ టీం-1లో వేణుగోపాల్, రాజశేఖర్, రాంబాబు, రమణ, శాంతారావు, సూర్యచంద్రరావులు ఉన్నారు. అడ్వాన్స్ టీం-2లో కృష్ణమూర్తి, శివరాం ప్రసాద్, రాజు, శ్రీనివాసరావు, మల్లిఖార్జున రావు, నాగరాజాలు ఉన్నారు. అడ్వాన్స్ టీంలు ఏం చేయాలనే దానిపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో సీఎం పర్యటనలకు 24 గంటల ముందు క్షేత్ర స్థాయికి అడ్వాన్స్ టీమ్‌లు వెళ్లనున్నాయి.

ప్రధాని మోడీ, సోనియాతో సీఎం స్టాలిన్ భేటీ.. టూర్ విశేషాలు ఇవే!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్‌లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మెట్రో రెండో దశకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్‌‌ఈపీని అమలు చేయకపోవడంతో ప్రస్తుతం నిలిపివేసిన సమగ్ర శిక్షా నిధులను కూడా విడుదల చేయాలని కోరారు. ప్రజల అభీష్టం మేరకు తమిళనాడు చాలా కాలంగా రెండు భాషల విధానాన్ని సమర్థిస్తోందని స్పష్టం చేశారు. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం పదే పదే అరెస్టు చేయడంపై తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీని కలిసిన తర్వాత స్టాలిన్‌ ఎక్స్ ట్విట్టర్‌లో తెలియజేశారు.

హర్ష కృష్ణుడి లాంటి కళ్లు నీవి.. యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్

హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హర్ష సాయితో యువతి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో యువతి హర్ష సాయితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ ఉంది. ఆ లీకైన ఆడియోలో యువతి మాట్లాడుతూ.. “హర్ష ఐ లవ్ యూ.. కాసేపు రొమాంటిక్‌గా మాట్లాడుదామా.. కొన్ని సార్లు నాకెలా అనిపిస్తదంటే.. మనిద్దరం డిబేట్‌కు అలా కూర్చోగలుగుతామా.. ప్రేమ మాటలకు అలా ఎలా కూర్చోగలుతాం అని ఫీలింగ్ వస్తుంది.. నాకు నా చెయ్యి నీ జుట్టు మీద పెట్టాలని ఉంటది.. దగ్గరకు తీసుకోవాలని ఉంటది. కౌగిలించుకోవాలని ఉంటది. హార్ట్‌బీట్ వినాలని ఉంటది. నీ శ్వాసను వినాలని ఉంటది. నువ్వు పడుకున్నప్పుడు చూడటం ఇష్టం. అంత మంచిగా పడుకుంటావు.. ప్రశాంతమైన నిద్ర.. సాఫ్ట్ బాడీ ఉంటది.. కళ్లెంత బాగుంటాయి.. అసలు నీవి కృష్ణుడి లాంటి కళ్లు తెలుసా?.. అవును నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు. చాలా చాలా చాలా.. అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది. స్కిన్‌ ఇంకా సాఫ్ట్‌గా ఉంటది. నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటది. నో సిగరెట్, నో మందు.. నో ఎక్స్‌ట్రా తప్పు అలవాట్లు.. నో ఫాల్తూ గాసిప్‌లు.. ఇలా ఆలోచిస్తే లక్ష మంచి క్వాలిటీస్‌ ఉన్నాయని” అంటూ యువతి రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో లీక్‌ అయింది. రొమాంటిక్ ఆడియో బయటపడడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని మాట్లాడిన యువతి రేప్ కేసు ఎందుకు పెట్టినట్లు అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసు వెనుక వేరే కారణం ఏదైనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

పరస్పర అభివృద్ధిలో పలుపంచుకుందాం… మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో భట్టి విక్రమార్క

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ఆయన గురువారం నాడు (సెప్టెంబర్ 26) ప్రపంచ వ్యాప్త వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిథులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిథుల సమావేశాలలో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, ముఖ్యంగా తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్ ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకున్నదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని కనుక అమెరికన్ కంపెనీల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంతకుముందు.. సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో.. చర్య తీసుకున్నారు. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ నేతృత్వంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ మేరకు లోకాయుక్త ఏడీజీపీ మనీష్ ఖర్బీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిఆర్‌పిసి సెక్షన్ 156(3) కింద సిద్ధరామయ్యపై కోర్టు కేసు నమోదు చేసింది. దీంతో పాటు సిద్ధరామయ్యపై ఐపీసీ 120బి, 166, 403, 420, 426, 465, 468, 340, 351 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసును లోకాయుక్త పోలీసులు విచారించనున్నారు. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సిద్ధరామయ్యను విచారణకు పిలిచే అవకాశం ఉంది. అలాగే.. సిద్ధరామయ్యను అరెస్టు చేసే అధికారం లోకాయుక్తకు ఉంది. ఈ క్రమంలో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. అంతకంటే ముందే తన న్యాయ నిపుణుల సలహా మేరకు సిద్ధరామయ్య ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

హైడ్రా కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

హైడ్రామా కమిషనర్ రంగనాథ్‌ను కోర్టుకు హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆదేశాలు అందాయి. ఇటీవల అమీన్‌పూర్‌లో హైడ్రా సంస్థ భవనాన్ని కూల్చివేసిన ఘటనపై కోర్టులో ఆందోళనలు వెల్లువెత్తడంతో వ్యాజ్యం ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేశారని హైకోర్టు ఆరా తీసింది. హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా లిఖితపూర్వకంగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిణామం హైడ్రా చర్యలపై న్యాయస్థానం యొక్క నిశిత పర్యవేక్షణను , చట్ట నియమాన్ని సమర్థించడంలో దాని తీవ్రమైన నిబద్ధతను సూచిస్తుంది. కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు కూల్చివేత ఎలా కొనసాగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ విచారణ సమయంలో వ్యక్తిగతంగా లేదా వాస్తవంగా వివరణ ఇవ్వాలని కమిషనర్‌కు సూచించబడింది. ఈ చర్య అటువంటి కూల్చివేతలలో అధికారులు అనుసరించే సరైన ప్రోటోకాల్‌ల గురించి ప్రశ్నలను లేవనెత్తింది , కోర్టు ఇప్పుడు పరిస్థితిని వివరంగా అంచనా వేస్తుంది. విచారణ తర్వాత మరిన్ని నవీకరణలు ఆశించబడతాయి.

జగన్‌ తిరుమల పర్యటన అందుకే రద్దు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తిరుమలకు జగన్‌ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్‌కు ఏ సాకులు ఉన్నాయో తెలియదన్నారు. జగన్‌ తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనన్నారు. దేవుడు, ఆచారాల కంటే ఏ వ్యక్తి గొప్పకాదన్నారు. ఆలయ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రం మనకు ఉండడం తెలుగువారి అదృష్టమన్నారు. ఇంతకు ముందు వెళ్లానని.. ఇప్పుడెందుకు వెళ్లకూడదని జగన్‌ అంటున్నారన్న చంద్రబాబు.. అప్పుడు నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారన్నారు. గతంలో చాలా మంది డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లారన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్‌ తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరని ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్యే కాదు బయట కూడా బైబిల్ చదువుకోవచ్చన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాల వెల్లువ.. రూ. 20 కోట్లు ఇచ్చిన రిలయన్స్

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తాయి. వరద సాయం నిమిత్తం రూ.20 కోట్లను రిలయన్స్ కంపెనీ విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు. రూ. 2 కోట్లు చొప్పున ఐటీసీ గ్రూప్, ఎల్జీ పాలిమర్స్ విరాళాన్ని అందజేశాయి. రూ. శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల తరపున రూ. 25 లక్షల చెక్కును మోహన్ బాబు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రూ71.50 ల‌క్షల చెక్కును అంద‌జేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయ‌న (రావ్ వెంక‌ట‌శ్వేత చ‌ల‌ప‌తికుమార కృష్ణ రంగారావ్‌), సుజ‌య్‌కృష్ణ రంగారావులు అందజేశారు. రూ.84.83 ల‌క్షల చెక్కును ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు కార్యక‌ర్తల త‌ర‌ఫున ఎమ్మెల్యే ప‌త్సమ‌ట్ల ధ‌ర్మరాజు, త‌దిత‌రులు అంద‌జేశారు.

మూసీ బఫర్ జోన్, FTLను ఎక్కడ ముట్టుకోలేదు

మూసీ బఫర్ జోన్, FTL ను ఎక్కడ ముట్టుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని కేటీఆర్ అనాడు ప్రకటించారని, అధికారంలో ఒకేలా! అధికారం కోల్పోతే మరోలా మేము మాట్లాడమన్నారు. మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుంది…అక్రమ కట్టడాలు అయినా వాళ్లకు మునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డు 7వేల కోట్లకు అమ్ముకున్నది గత BRS కాదా! అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కు BRS పదేళ్ల పాలనలో కృష్ణా, గోదావరి నీళ్లు ఒక్క TMC అయినా తెచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. 2014 వరకు 25 STPలు ఉన్నాయి…గత పదేళ్ళలో చేసింది ఏంటి అంటే శూన్యమని, కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను డిస్టర్బ్ చేయలేదన్నారు. హైదరాబాద్ నీళ్ళల్లో మునుగుతే పదివేలు BRS కార్యకర్తలు పంచుకొని చేతులు దులుపుకున్నారని, ప్రజలపై కేటీఆర్ కు ప్రేమ ఉంటే నన్ను కలిసి మీ అభిప్రాయం పంచుకోండన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.