ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చ చేపట్టారు. సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు.
బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు
బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చవద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఖజురహోలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధి కొత్త రూపు సంతరించుకుందన్నారు. రూ.వేల కోట్ల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. నేడు కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. దేశాభివృద్ధిలో వాజ్‌పేయ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సుశాసన్ దినోత్సవం ప్రభుత్వానికి ఒక్కరోజు కార్యక్రమం కాదని.. అది తమ గుర్తింపు అని పేర్కొన్నారు.
జనవరి 8న ఏపీకి ప్రధాని.. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. నవంబరులో జరగాల్సిన ప్రధాని పర్యటన తుఫాన్ కారణంగా వాయిదా పడడంతో శంకుస్థాపనలు నిలిచిపోయాయి.
ఆరు గ్యారంటీలు మరచి అరెస్టులపై శ్రద్ధ
ఆరు గ్యారంటీ ల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ మళ్లించేందుకే అల్లు అర్జున్ పై అనవసర చర్చ పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి పై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తప్పు పట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యసాదింపులో భాగంగానే లగచర్ల కేసులో నాపై తప్పుడు కేసులు బనాయించి 37 రోజులు జైల్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారన్నారు. ప్రజా సంక్షేమం అంటూ అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటూ అమాయక ప్రజలను ఆకట్టుకొని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓట్లు వేసిన రైతులకు బీడీలు వేసిన ఘనత దేశంలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి కే చెల్లిందన్నారు.
బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
ఓ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోరబండ సీఐ శేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయస్సున్న బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బుక్ చేసుకున్న ఆటోలో మాదాపూర్ నుంచి బోరబండలోని ఇందిరానగర్‌కి వెళ్తోంది. బోరబండ అన్నానగర్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోను అడ్డగించారు. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు.. అని యువతిని ప్రశ్నించారుఇద్దరు బలవంతంగా వారి ఆటోలోకి ప్రవేశించారు. ఒక యువకుడు అమ్మాయి పక్కన కూర్చున్నాడు. యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ వేధించాడు.
ఏపీ పర్యటనకు రావాలని ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. పలు ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం పై ప్రధానికి వివరించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతకు ముందు ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.
రాజ్యాంగ బద్ధ సంస్థలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు
నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యేవరకు.. పాస్ పోర్ట్ రావాలంటే రెండు మూడేళ్లు పట్టేదన్నారు. ఐక్యరాజ్య సభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజపేయి అని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారత దేశాన్ని కించ పరిచే విధంగా అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, రాజ్యాంగ బద్ధ సంస్థలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విదేశాలకు వెళ్ళిన వాజ్ పేయ్.. దేశ ప్రతిష్టను పెంచే విధంగా మాట్లాడారని, ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో చూడండన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని తృణ ప్రాయంగా వదిలేసి ప్రజల మధ్యకు వెళ్ళారని, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు వాజపేయి చేశారన్నారు కిషన్ రెడ్డి. స్వర్ణ చతుర్భుజి పేరుతో 75 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు ప్రారంభించారన్నారు.
రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ రేపు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులతో కలిసి భేటీ కావాలని దిల్ రాజు ప్రకటించారు. అయితే.. తాజాగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల మధ్య ముఖ్యమైన భేటీపై క్లారిటీ వచ్చింది. ఈ సమావేశం రేపు ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనుంది. ఈ భేటీలో టాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు.
వాజపేయి జైల్లో ఉన్నా.. దేశం కోసమే పని చేశారు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అటల్ బీహారీ వాజపేయి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. అటల్ జీ వంటి మహా నేతలు పని చేసిన పార్టీలో ఉండి ప్రజలకు..పార్టీకి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పీవీ నరసింహారావు.. వాజపేయి మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. పీవీ నరసింహా రావు పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించింది అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. వాజపేయి జైల్లో ఉన్న దేశం కోసమే పని చేశారన్నారు. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు అనురాగ్ ఠాగూర్.
టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి.. 20 మంది సేఫ్!
ముంబైలో ఫెర్రీ బోటు ప్రమాదం మరువక ముందే గోవాలో మరో ప్రమాదం జరిగింది. గోవాలోని కలాంగుట్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 20 మందిని రక్షించారు. ప్రమాదంలో 54 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల పడవ బోల్తా పడిందని.. ఒకరు చనిపోగా.. 20 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.