NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్

జూన్ 21న (రేపు) తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తన అనుభవాన్ని మొత్తం తెలంగాణకు ధారపోసి, రాష్ట్ర ఏర్పాటుకు ముందే అన్ని రంగాల్లో మన రాష్ట్రానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తును వీక్షించిన స్వాప్నికుడు జయశంకర్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట ని రెవిన్యూ విలేజ్ గా ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్..

అవినీతి కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. అతని పార్టీ పీటీఐకి చెందిన పలువురు కీలక నేతలు కూడా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన రాజకీయ సలహాదారు లాహోర్‌లో కిడ్నాప్‌కి గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు షాబాజ్ గిల్ అన్నయ్య అయిన గులాం షబ్బీర్ రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్‌కు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని కహ్నా పోలీస్ స్టేషన్‌‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. లాహోర్‌లోని ఖయాబాన్-ఎ-అమీన్‌లోని తన నివాసం నుండి షబ్బీర్ అర్థరాత్రి ఇస్లామాబాద్ వైపు బయలుదేరినట్లు అతని కుమారుడు బిలాల్ ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభించలేదు.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ మార్గంలో వందే భారత్

రైలు ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటి వరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ రైలును కొత్త రూట్లలో నడపడానికి ఇండియన్ రైల్వే సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో.. ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. కాగా.. బెంగళూరు-మధురై రూట్లో వందే భారత్ రైలు ఈరోజు నుంచి ప్రారంభమైంది.

గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి..

గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి పవన్‌ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అందుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం అధికారులతోనూ సమీక్ష జరిపారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు. సుమారు రెండున్నర గంటల సేపు సమీక్ష సమావేశం సాగింది.

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు గతి తప్పాయి

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు గతి తప్పాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్ జైల్ లో గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. కేవలం హిందువులపై కక్ష పూరితంగా అక్రమంగా కేసులు నమోదు చేస్తూ జైలుకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జిల్లా పోలీస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జిల్లా ఎస్పీ తీరుపై కేంద్ర హోం శాఖ మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. రేపు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ చేయించనున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పించారు.

జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ విచారణ కమిషన్ నుంచి తప్పుకోవాలి

ముఖ్యమైన స్థానాలకు వ్యక్తులను ఎన్నుకునే ముందు ప్రభుత్వం క్షుణ్ణంగా నేపథ్యాన్ని తనిఖీ చేయాలని పేర్కొంటూ, ఇంధన విధానంపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నైతిక, నైతిక , సాంకేతిక కారణాలపై నిష్క్రమించారు. ప్రవీణ్ కుమార్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ , కమిషన్ అందించిన నోటీసుకు ప్రతిపక్ష నాయకుడు , బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు నుండి 12 పేజీల ప్రతిస్పందన తెలంగాణను స్వయంచాలకంగా చేయడంలో చంద్రశేఖర్ రావు , అతని సాంకేతిక నిపుణుల బృందం యొక్క దృష్టి , శ్రమను స్పష్టంగా చిత్రీకరిస్తుంది. విద్యుత్ ఉత్పత్తిలో సరిపోతుంది.

సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత.. డీజీపీకి లేఖ

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తీసుకుంటుందని డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ రాసింది. జూలై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్ఎఫ్ అధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్ విభాగాన్ని ఉప సంహరించాలని లేఖలో వెల్లడించింది. జూలై 2 నుంచి భద్రతా విధులు చేపట్టనున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోసం బారక్‌లు కూడా ఖాళీ చేయాలని డీజీపీని ఎయిర్ పోర్ట్ అథారిటీ కోరింది.

సింగరేణి కాలరీస్‌ను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

16 ఎంపీలు సాధించిన టీడీపీ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణలో చేరి 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ , బీజేపీ గెలిచిందని, సింగరేణి బొగ్గు గనులను బహిరంగ మార్కెట్‌లో రేపు కేంద్రం వేలం వేయబోతుందన్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాశారని, మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో సింగరేణి బొగ్గు గనుల వేలం ఆపాలని అప్పటి ప్రధాని మోడీ కి లేఖ రాశారన్నారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మోడీని అప్పుడు కోరారు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ అని ఆయన అన్నారు. గత కేంద్ర ప్రభుత్వ హయంలో ఒడిశా లో , గుజరాత్ లో గనులను ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించారని ఆయన అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోయింది.. ప్రైవేటీకరణ చేస్తున్నాం అని అన్నారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు దగ్గరలో గనులు ఇవ్వకుండా…ఆధానికి …ఇంకా ఎవరికో పోయిందన్నారు. సింగరేణి పై ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర జరుగుతుందని, సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఎందుకు సింగరేణి బహిరంగ వేలంలో పాల్గొంటామని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, తొమ్మిదనర ఏళ్ల పాటు సింగరేణి బొగ్గు గనుల వేలం వేయకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకున్నదన్నారు.

నిర్మాతలకు మంత్రి ఆహ్వానం.. స్టూడియోలు నిర్మాణం చేసేందుకు ముందుకు రండి..

మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని.. గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామన్నారు. నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని… ఏపీలో స్టూడియోలు నిర్మాణం చేయటానికి ముందుకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు. ఏపీ మంచి వనరులున్న రాష్ట్రమని.. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం , అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామన్నారు. రెండు కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్‌పై మొదటి సంతకం పెట్టానని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.