NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు బిజీబిజీగా డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టిన తొలి రోజే కొణిదెల పవన్ కళ్యాణ్ శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భగా బాధ్యతలు స్వీకరించిన రోజంతా బిజీబిజీగా గడిపారు. ఇవాళ వరుస సమీక్షలు నిర్వహించారు. నేటి ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖల HODలతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం.. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇక, ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులపై అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకుని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట్ చేసుకున్నారు. అలాగే, ఆయా శాఖల్లో కార్యాచరణపై మరోమారు త్వరలోనే సమీక్ష సమావేశాలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుందామని అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో రేపు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమిలోని ఎనిమిది మంత్రులు రేపు తమ పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. రేపు ఉదయం 7 30 గంటలకి మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రిగా టీజీ భరత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, ఉదయం 9.30కి మంత్రి నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, ఉదయం 10.30కి గొల్లపల్లి దేవదాయ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, రేపు ఉదయం 10.35 గంటలకు మంత్రి సవిత పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలను చేపట్టనున్నారు.

ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు వెల్లడించారు. జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా జి సాయి ప్రసాద్, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శిగా శశి భూషణ్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాల కృష్ణా ద్వివేది, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్, పౌరసరఫరాలశాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఆర్థికశాఖ కార్యదర్శిగా వినయ్ చంద్, ఆర్థికశాఖ వ్యయ కార్యదర్శిగా ఎం జానకి, పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్, ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం. ఇక, శ్రీలక్ష్మీ , రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళిధర్ రెడ్డిని జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైంది”..బీఆర్ఎస్ పై రఘునందన్ ఫైర్
మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ లో తాను దెబ్బకొడితే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టైటానిక్ షిప్ లా బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యిందని విమర్శించారు. నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే జనాలు సీఆర్ఎస్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఎంపీ అంటే సంగారెడ్డి వరకు మెట్రో పక్కా అనే నినాదంతో పని చేస్తానన్నారు. పార్టీలకతీతంగా నాకు ఓట్లేసి నాపై నమ్మకంతో గెలిపించారని కొనియాడారు. ఓడీఎఫ్, బీడీఎస్ పరిశ్రమ ఉద్యోగులకి వర్క్ అర్దర్లు పెంచుతామని హామీ ఇచ్చారు.

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం
ఉస్మానియా హాస్పటల్ నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఉన్న స్థలంలోనే ఉస్మానియా హాస్పటల్ నిర్మిస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “హైదరాబాద్ కు కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం ఉంటుంది. హై కోర్టు భవనం దేశానికి ఆదర్శంగా ఉండేలా నిర్మాణం ఉంటుంది. గత ప్రభుత్వంది అకౌంట్ అయితే మాది అకౌంబులిటి ప్రభుత్వం. టీమ్స్ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆరోగ్యశాఖతో కలిసి మరోసారి సమీక్ష చేస్తాం. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చారు. మూడున్నర ఏళ్లలో RRR పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులు చేయాలని అదేశించాం. విజయవాడ రోడ్డు అనగానే డెత్ రోడ్డు అనే పేరు ఉంది. డిసెంబర్ లోపు సిక్స్ లైన్ రోడ్డు పనులను మొదలు పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. రేపటి నుంచి ఫుల్ టైం యాక్షన్ లోకి దిగుదాం.. కేంద్రం నుంచి నిధులు తెస్తాం.” అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎక్కువశాతం రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ” పార్లమెంట్ లో ఇండియా కూటమి బలం ఉంది…కేంద్రం పై ఒత్తిది చేస్తాం. ఉప్పల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్, అంబర్ పేట పనులు ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. మూడు నెలల్లో అంబర్ పేట పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశాం.

హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం..రూ.100 కోట్లు లూటీ
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం బయటపడింది. జీఎస్ఆర్ (GSR) ఇన్ఫ్రా గ్రూప్.. ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్టు, యాదాద్రిలో భారీ వెంచర్ల అంటూ ప్రచారం చేసింది. సంస్థ ఎండి శ్రీనివాసరావు మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించాడు. 2020 నుంచి డబ్బులు వసూలు చేశాడు. మూడు సంవత్సరాలు అయినా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు..
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి, రాగి, మొక్కజొన్న, జొన్న, పత్తితో సహా 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరి కనీస మద్దతు ధరను రూ. 117 పెంచినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ మద్దతు ధర పెంపుతో క్వింటా వరి ధర రూ. 2300కి చేరుతుంది. పంటల ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు ఎంఎస్‌పీని కేంద్రం ఆమోదించింది. నూనెగింజలు, పప్పుధాన్యాలకు అత్యధికంగా మద్దతు ధరను పెంచారు. కొత్త ధరల ప్రకారం క్వింటాల్‌కి.. కందిపప్పుకు రూ. 7500, మినుములకు రూ. 7400, పెసరకు రూ. 8682, వేరు శనిగకు రూ. 6783, పత్తికి రూ. 7121, జొన్నకు రూ. 3371గా ఉంది. తాజా నిర్ణయంతో రైతులు దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల ఎంఎస్‌పీ అదనంగా లభిస్తుందని, గత సీజన్‌తో పోలిస్తే ఇది రూ. 35,000 ఎక్కువ అని మంత్రి చెప్పారు. ఇదే విధంగా క్వింటా చొప్పున రాగులకు రూ. 4,290, సజ్జలకు రూ. 2,625, మొక్కజొన్న రూ.2,225 వద్ద రేట్లను నిర్ణయించారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల టీమ్ పై 4 పరుగుల తేడాతో గెలిచి 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణయ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 50 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు మాత్రమే చేసింది.

షాకింగ్ : అశ్విని దత్ కాళ్ళు మొక్క బోయిన అమితాబ్..!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కి రానా హోస్ట్గా వ్యవహరించగా ప్రభాస్ తో పాటు సినిమాలో నటించిన వారు ఈ సినిమాలో తమ ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇదే ఈవెంట్లో ఒక ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. అదేమిటంటే తెలుగు సినిమాలకు సంబంధించి బిగ్ టిక్కెట్ లాంచ్ అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే బిగ్ టిక్కెట్ లాంచ్ చేసిన తర్వాత దాన్ని స్వయంగా డబ్బులు ఇచ్చి అమితాబచ్చన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని కమల్ హాసన్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబచ్చన్ అశ్వినీ దత్ గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పి ఆయన కాళ్లు మొక్కబోయారు. వెంటనే అశ్వినీ దత్ కూడా రియాక్ట్ అయ్యి ఆయన కూడా అమితాబచ్చన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. అశ్వినీ దత్ చాలా గొప్ప మనిషి అని ఇంత సింపుల్ గా ఉండే నిర్మాతను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. సెట్లో ముందుండే ఆయన హీరో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అమితాబ్ చెప్పుకొచ్చారు.