NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది

రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు తీసుకున్న రుణమాఫీ 40 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి 16 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం అవుతుందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేసి మిత్తికి మిత్తి కట్టి రైతులు అప్పుల పాలు అయ్యారని, దగాకోరు కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేసిందా లేదా కాదు  రైతులకు బ్యాంక్ లోను తీర్చి క్లియరెన్స్  సర్టిఫికెట్ ఇప్పించాలన్నారు బండి సంజయ్‌. లోన్ తీసుకున్న రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్ రాకుంటే భవిష్యత్ లో ఎలాంటి రుణం పొందలేరని, రైతులకు 70 శాతం రుణమాఫీ జరగలేదన్నారు బండి సంజయ్‌.

“ఎందుకీ ద్వంద్వ వైఖరి”.. సీఎం మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ తండ్రి ఆగ్రహం..

కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన ఆమెనే, న్యాయం కోసం రోడెక్కి ర్యాలీ చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యాన్ని కలకత్తా హైకోర్టు తూర్పారపడుతోంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఇదిలా ఉంటే, సీఎం మమతా బెనర్జీపై వైద్యురాలి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన..‘‘ముఖ్యమంత్రి నా కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో తిరుగుతూ సుదీర్ఘంగా మాట్లాడుతున్నారని, అదే సమయంలో, ఆమె ప్రజల ఆగ్రహాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తుందని, ఆమె ఎందుకు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది? ఆమె ప్రజలకు భయపడిందా? మా ప్రశ్నలకు సమాధానం కావాలి..’’ అని అన్నారు.

ప్రియురాలి మోజులో పడి పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఘనుడు

హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ మాట్లాడుతూ… బషీర్ బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్ బాగ్ లోని శ్రీ సిద్ది వినాయక్ జెవెల్లెర్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ ప్రేవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇంచార్జ్ గా పని చేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీ కు రాకుండా , ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో … సదరు యజమానికి అనుమానం వచ్చి , ఆడిట్ నిర్వహించాడు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు.

రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

రేపు సోమశిల జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు(సోమవారం) శ్రీసిటలో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయడంతో పాటు మరో 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అలాగే ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో భూమిపూజ, ప్రారంభోత్సవాల తర్వాత ఫాక్స్‌కాన్‌ పరిశ్రమల ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం వివిధ పరిశ్రమల సీఈవోలతో సమావేశం నిర్వహించనున్నారు. శ్రీ సిటీ లో కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సోమశిల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించునున్నారు.

కోల్‌కతా రేప్ ఘటనపై సూర్యకుమార్ ఇన్స్టాలో పోస్ట్.. వైరల్

కోల్‌కతాలో జరిగిన సామూహిక అత్యాచారం-హత్య ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌తో పాటు యావత్‌ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి అనేక సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలాంటి ఘటనలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మెస్సెజ్ ఇచ్చాడు. ఆయన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పంచుకున్నాడు. ‘కూతుర్ని కాపాడుకోవడం కంటే.. కొడుకు, తమ్ముడు, భర్త, తండ్రి, స్నేహితులకు చదువు చెప్పించడం మేలు’ అని తెలిపాడు.

పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలి

పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లేని యెడల నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని ఆయన వెల్లడించారు. ఈ రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, ప్రభుత్వ మేడలు వంచుతాం ఏలేటి మహేశ్వర్‌ అన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారు, ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, రైతు భరోసా ఎప్పడు ఇస్తారో సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిందని, 60 లక్షల మంది రైతులు అర్హులుండగా..కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిందన్నారు.

బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది..

బీజేపీ తనకు అనుకూలంగా లేని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ సపోర్ట్‌తో ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నారని.. కర్ణాటక సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భూమికి, మరో భూమి ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి విషయంలో చంద్రబాబు చేసింది ఇదే కదా అంటూ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న సీఎంను అవినీతి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు.

48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటీఎంలను అంతరాష్ట్ర ముఠాలు కొల్లగొట్టాయి. 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఎంలను దోచేశారు ఆగంతకులు. సుమారు 50 లక్షల రూపాయలు చోరీ అవ్వగా…. దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి మునగపాకలోని ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొడితే… ఇవాళ విశాఖ నగర పరిధిలో రెండు చోరీలు జరిగాయి. పెందుర్తి నటరాజ్ థియేటర్ పక్కనే ఉన్న ఏటీఎంలో సీసీ కెమెరాలకు బ్లాక్ పెయింట్ వేసి మరి దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం పూర్తిగా ధ్వంసం చేసి సుమారు 19 లక్షలు ఎత్తుకెళ్లారు. భీమిలి పరిధిలోని తగరపువలస జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏటీఎంలో లూటీ చేశారు అంతరాష్ట్ర నేరగాళ్లు. ఇక్కడ సుమారు 15 లక్షలు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ మూడు చోరీలు ఒకే బ్యాంకుకు సంబంధించినవి కాగా.. నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న ఏటీఎంలో టార్గెట్ చేయడం అటు బ్యాంకు వర్గాలను, ఇటు పోలీసులను పరుగులు పెట్టించింది.

హేమంత్ సోరెన్ vs చంపాయి సోరెన్.. బీజేపీ డబ్బుతో కొనాలని చూస్తుందన్న సీఎం..

ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జార్ఖండ్ ముక్తి మెర్చా(జేఎంఎం) సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చంపాయి సోరెన్ ఢిల్లీకి వెళ్లడం ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. తాను పార్టీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నట్లు చంపాయి పేర్కొనడం ఆయనా పార్టీ మారుతారనే వార్తలకు బలం చేకురుస్తుంది. తన ముందు మూడు దారులు- రాజకీయాల నుంచి విరమించుకోవడం, కొత్త పార్టీని స్థాపించడం, తనకు అండగా నిలిచేవారితో ప్రయాణించడం అని అన్నారు. అయితే, ఈ పరిణామాలపై సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై ధ్వజమెత్తాడు. ‘‘ఇళ్లను విభజించి రాజకీయ పార్టీలను కూల్చే పనిలో బీజేపీ నిమగ్నమైందని విమర్శించారు. ఒకరోజు ఈ ఎమ్మెల్యేని కొంటారు, రేపు మరో ఎమ్మెల్యేని కొంటారు. డబ్బు ఉంటే నాయకులు పార్టీ మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ పర్వాలేదు, ఇండియా కూటమి ప్రభుత్వం 2019 నుంచి ప్రజలకు అండగా నిలుస్తుంది’’ అని ఈ రోజు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదు

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయన్నారు. 2014 పునర్విభజన చట్టాన్ని పదేళ్లపాటు కేంద్రం అమలు చేయలేదని, పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదన వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామని ఆయన తెలిపారు.