NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి

కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్చ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా ఒక్కసారిగా కప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. కార్మికులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్లలో స్పష్టంగా కనిపిస్తోంది

పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్ల లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరుకు పోయిన ధాన్యాన్ని వేలం వేయడానికి పిలిచిన టెండర్లలో జరిగిన అక్రమాల్లో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇందులో వాటాలు వెళ్లాయని, మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సేకరణ కు పిలిచిన తాజా టెండర్లలోనూ చేతి వాటం ప్రదర్శించారని ఆయన మండిపడ్డారు.

తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిరిండియా విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం పూణె ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టి డ్యామేజీకి గురైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బెంగళూరు-ఢిల్లీ విమానం కూడా శనివారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తాజాగా శనివారం బెంగళూరు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం తమిళనాడులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరుచిరాపల్లికి మళ్లించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్ విచారం వ్యక్తం చేసింది.

రేపు బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి..

ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సోమవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారు. దీనిపై పోలీస్ విచారణ జరుగుతోంది. ఈ అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ, ఆప్ పార్టీల మధ్య రాజకీయంగా విమర్శలు జరుగుతున్నాయి. ఆదివారం తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ నేతలు, కార్యకర్తలతో వెళ్తానని, అధికార పార్టీ దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.

స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ప్రధాని మోడీ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌ని ఒక్కోక్కరిగా జైల్లో పెట్టి ఆట ఆడుతున్నారు, నేను నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాని వస్తాం, మీరు ఎవరిని జైలులో పెట్టాలనుకుంటే, వారందరికి ఒకే సారి అరెస్ట్ చేయవచ్చు’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం..

ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో మరికాసేపట్లో జడివాన కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్ లో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వరి పంట నీట మునిగింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, కంది, సదాశివపేటలో భారీ వాన కురియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరియు మే 21 వరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఏకాంత వర్షపాతం నమోదైంది మరియు TSPDS డేటా ప్రకారం, జయశంకర్ భూపాలపల్లిలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఆ తర్వాత కామారెడ్డి మరియు కరీంనగర్‌లో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ప్రజలకు హెచ్చరిక ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ప్రజలకు హెచ్చరిక ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురి రిక్వెస్ట్..

సీరియల్‌ నటుడు చందు బలవన్మరణంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. నటుడు చందు, నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్నిరోజులు అంతా భావించారు. కానీ., వారిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది. గడిచిన ఆరేళ్లుగా చందుతో పవిత్ర జయరాం రిలేషన్‌ లో ఉన్నాడని చందు భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇక ఈ విషయం వైరల్‌గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రతీక్ష కూడా తాజాగా స్పందించింది. చందు, పవిత్ర జయరాంల బంధం గురించి తప్పుగా మాట్లాడవద్దని ప్రతీక్ష రిక్వెస్ట్‌ చేస్తుంది. ముందు వాళ్లిద్దరూ మంచి స్నేహితులని స్పష్టం చేసింది. చందు కూడా తనతో తరచూ ఫోన్‌ లో టచ్ లో ఉండేవారని.. ఆయన ఎప్పుడు చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించే వారని చెప్పుకొచ్చింది.

టీఎస్ఎస్పీడీసీఎల్ ఇక నుంచి టీజీఎస్పీడీసీఎల్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమ ఆకాంక్షలను రాష్ట్ర నామకరణం ప్రతిబింబించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. విధాన పత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్‌లు, సర్క్యులర్‌లు, నివేదికలు , ఇతర కమ్యూనికేషన్ మెటీరియల్‌లతో సహా అన్ని అధికారిక పత్రాలు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాల యొక్క అన్ని అధికారిక కమ్యూనికేషన్‌లలో TSకి బదులుగా TG నామకరణాన్ని ఉపయోగిస్తాయి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర సంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు , ఇతర ప్రభుత్వ సంస్థలకు తెలంగాణ నామకరణం తక్షణమే TS స్థానంలో రాష్ట్ర అధికారిక ప్రాతినిధ్యంగా TG ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి

మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారన్నారు. 400 సీట్లు NDA కు వచ్చే వాతావరణం ఉందని, మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని కిషన్‌ రెడ్డి అన్నారు. హమీలు నెరవేర్చలేని ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని, బ్యాంకుల నుండి అప్పులు తీసుకోని రుణ మాఫీకీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణను కాంగ్రెస్-బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆయ పేర్కొన్నారు. భవిష్యత్తు లో తెలంగాణ ను రక్షించుకునే భాద్యత బీజేపీ తీసుకుంటుందని, బీజేపీ MLC అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు కిషన్‌ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది.