స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలి అని నిర్ణయించాం.. అందుకే..
అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. “ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు.. గతంలో నేను ఏ ఊరికి వెళ్ళినా మరుగుదొడ్లు రోడ్డు సైడ్, చెత్త కుప్పలు కుప్పలుగా స్వాగతం పలికేవి… సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఆడబిడ్డకు మరుగుదొడ్లు కట్టించా.. మహిళల ఆత్మగౌరవం నిలిపేందుకు మరుగుదొడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టా. ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వర్షం వస్తే వంట చేయాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రతి ఆడబిడ్డ వంట చేయడం కోసం గ్యాస్ కనెక్షన్ ఇచ్చా. భారతదేశాన్ని స్వచ్ఛభారత్ గా మార్చాలని ప్రధాని ముఖ్యమంత్రిల సమావేశం నిర్వహించారు. దేశ విదేశాలు తిరిగి ప్రధానికి పరిశుభ్రతపై సమగ్రమైన నివేదిక ఇచ్చా.. సమాజ హితం కోసం పనిచేసిన వారిని మనం గుర్తించాలి.. ప్రతి నెల మోడల్స్ శనివారం అందరం కలిసి స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలి అని నిర్ణయించాం.” అని సీఎం వెల్లడించారు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరం..
స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లను తిట్టడం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఆ నలుగురి దగ్గర అంతరంగికుడిగా ఉన్న కడియం.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరమన ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి, పార్టీకి పుట్టిన పిల్లలను.. కాంగ్రెస్ పార్టీ పిల్లలు అనడం హాస్యాస్పదమని ఆయన సెటైర్ గుప్పించారు. 40 ఏండ్లు కాంగ్రెస్ ఉసెత్తని, కాంగ్రెస్ కు ఓటు వేయని కడియమని, కామెర్లు కమ్మినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
ఇలా చేస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.. హత్యలు చేస్తే కాదు?
స్వచ్ఛ భారత్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యమైన అవసరమని.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఆ తర్వాత మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. “ప్రతి నెల మూడవ శనివారం ఏ పని అవసరం లేదు.. మనల్ని మనం బాగు చేసుకోవాలి. పర్యాటకులు మోసం చేస్తే రారు, పరిశుభ్రంగా లేకుంటే రారు, హత్యలు చెస్తే రారు.. పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు వస్తారు. ప్రతి ఇంటి వద్ద చెత్త కలెక్ట్ చేశారా లేదా అనేదానికి క్యూఆర్ కోడ్ పెడతాం. పొడి తడి చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేస్తాం. చెత్త నుంచి ఆదాయం పొందడంపై అందరూ దృష్టి సారించాలి. చెత్త నుంచి విద్యుత్ బయోగ్యాస్ వంటివి తయారు చేయవచ్చు. ఇది నాకు నచ్చిన పని నేను మనసుపెట్టి పని చేస్తా. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 2025 అక్టోబర్ లోపల ఇది పూర్తి చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఒకపక్క గాలి కలుషితం అవుతోంది, మరోపక్క తాగే నీరు కలుషితం అవుతోంది” అని సీఎం తెలిపారు.
రేషన్ కార్డుల జారీ పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి అందే వరకు కొనసాగుతోందన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు… పాత కార్డులతో అదనపు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుతామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. మొదట కుల గణన జాబితాలో ఉండి అర్హులైన వారికి ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుల గణన జాబితా లో పేర్లు లేని వారు…గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. పాత రేషన్ కార్డులు కొనసాగుతాయని, ప్రజలు అపోహలు…ఆందోళన చెందకండని ఆయన వివరించారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించే వరకు ప్రక్రియ కొనసాగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
టీటీడీ వరుస ఘటనలపై కేంద్రం సీరియస్..
తొక్కిల లాంట, లడ్డూ కౌంటర్లలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. టీటీడీ బోర్డును కేంద్రం నివేదిక కోరింది. టీటీడీ చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్‌కుమార్ జిందాల్‌ను ప్రత్యేకంగా నియమించింది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు సంజీవ్ జిందాల్ పర్యటించి వివరాలు సేకరించనున్నారు. టీటీడీ కూడా ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వైకుంఠ ఏకాదశికి ముందు.. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. గాయపడిన వాళ్లకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై ఎగిరిన గుర్తు తెలియని డ్రోన్..
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ రోజు మధ్యాహ్నం 1గం.30 నిమిషాలు నుంచి 1గం.50 నిమిషాల మధ్య డ్రోన్ ఎగిరింది. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని గుర్తు తెలియని డ్రోన్ ఎగిరిన విషయంపై డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది సమాచారమిచ్చారు. అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకి కూడా తెలిపారు. అదే విధంగా ఇటీవల బుక్ ఫెస్టివల్ ప్రారంభానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ స్టాల్స్ దగ్గర ఉండగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
“కులగణన”తో మోసం.. నితీష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ
బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తు్న్నాయని, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
మేము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టాం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే పర్వం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గడిచిన పది సంవత్సరాల్లో నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్ష రాయలేక పోయారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా పండగ లాగా నియామక పత్రాలు ఇచ్చామన్నారు భట్టి విక్రమార్క. సంవత్సరం లోపే 56 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, 5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు నిర్మిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ శాఖ కృషి చేస్తోందని, 2023 – 24న మార్చి 8 పీక్ డిమాండ్ వచ్చింది. దాన్ని తట్టుకుని అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ తీసుకు రావాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, 22,444 మెగావాట్ల పీక్ డిమాండ్ వస్తే కూడా ఇబ్బంది కలుగకుండా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని చూస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో “బడా నేత” బడే చొక్కారావు హతం..
బీజాపూర్‌లోని పుజారి -కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశాడు. బడే చొక్కా రావు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. బడే చొక్కా రావు అలియాస్ (దామోదర్, మల్లన్న) ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామవాసి. ఇతను మిలిటరీ చీఫ్‌గా కూడా పనిచేశాడు. గతంలో భద్రతా దళాలను టార్గెట్ చేసి వారిపై కాల్పులు, ల్యాండ్ మైన్ పేల్చిన ఘటనలో కీలక పాత్ర పోషించాడు. చొక్కా రావు తల్లి బతుకమ్మ.