Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 60 మంది సభ్యులు గల అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని ఈసీ శనివారం ప్రకటించింది.

మద్యం ఇతర రాష్ట్రాలకు తరలించిన చరిత్ర, ఖ్యాతి బీఆర్ఎస్‌కే దక్కింది

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే కవిత అరెస్ట్‌కు కారణం అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కవిత అరెస్ట్ పై రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ స్పందించారు. మద్యం కుంభకోణంలో కవితను అరెస్ట్ చేశారని, గత సంవత్సర కాలంగా దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కూడా సగం మంది మంత్రులు కూడా ఈ విజయంలో జైలుకు వెళ్లారన్నారు. కేసీఆర్ అభిమానులు, అనుచరులతో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌ గురించి గొప్పలు చెప్పేవారని ఆయన అన్నారు. కేసీఆర్ అపర భగీరథుడని, నదులకు నడక నేర్పాడని పోగిడేవారని ఆయన విమర్శించారు. నదులకు నడక సంగతి దేవుడెరుగు కానీ.. మద్యాన్ని మాత్రం ఢిల్లీ కి తరలించారని, మద్యం ఇతర రాష్ట్రాలకు తరలించిన చరిత్ర, ఖ్యాతి బీఆర్ఎస్ కే దక్కిందని ఆయన మండిపడ్డారు.

దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తాం..

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈసారి ఆన్ లైన్లో నామినేషన్ ఫారంలు ఫిలప్ చేసుకోవచ్చుని తెలిపింది. కానీ ప్రింటవుట్ తీసుకుని ఆర్వోకు ఫిజికల్ గా అందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ‘‘ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది.

ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి కవిత

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారని రోస్ అవెన్యూ కోర్టు శనివారం తెలిపింది. ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడిని రిమాండ్‌కు తరలించాలని కోరుతూ ఈడీ చేసిన దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విచారణ సంస్థ కోరింది. అయితే, న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు మాత్రమే రిమాండ్ విధించారు. చట్టవిరుద్ధం, దీనిపై కోర్టులో పోరాడతాం’ అని కోర్టు ముందు హాజరుపరుస్తుండగా కవిత చెప్పారు.

వీధి వ్యాపారులపై సర్వే.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం..

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు వీధి వ్యాపారుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నగరంలోని ‘‘రేహ్రీ-పాత్రి’’(వీధి వ్యాపారుల) సర్వేని ప్రకటించారు. వీరికి తమ దుకాణాలను నిర్వహించడానికి స్థలాన్ని అందించేందుకు ఈ సర్వే ఉద్దేశించబడింది. ఈ సర్వే కొన్ని నెలల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత వారికి సరైన పద్ధతిలో స్థలాన్ని అందిస్తామని, తద్వారా ఇతర దుకాణదారులకు, ట్రాఫిక్‌కి సమస్య ఉందని ఆయన ఓ వీడియో సందేశంలో చెప్పారు.

అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానం

కాన్హాశాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానమన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లో ఇవాళ ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతమని, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ ‑ మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా మనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో స్వామి వివేకానందుడు అందించిన సందేశం యావత్ ప్రపంచానికి భారతదేశ తత్వాన్ని మరోసారి గుర్తుచేసిందని, భారతదేశం ప్రపంచంలోని దేశాలన్నింటికీ మిత్రదేశమని కిషన్ రెడ్డి అన్నారు.

టీడీపీలో చేరిన ఎంపీ మాగుంట.. ఆయన రాకతో రాజకీయాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయాలు తిరగబడింది. దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.

హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?

లోక్‌సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెప్పారు. 2019 నుంచి 2023కి బీజేపీ తన ఓట్ల శాతాన్ని 14 శాతానికి పెంచుకుంది. ఈ సారి తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో రెండంకెల కన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం

ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానున్నట్లు.. ఆరోజు నుండి నామినేషన్లు స్వీకరించబడుతాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 13 మే లోక్‌ సభ ఎన్నికలకు పోలింగ్‌.. జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లోకి వచ్చిందని ఆయన తెలిపారు. 45,70,138 ఓటర్లు ఉన్నారని, నామినేషన్ చివరి తేదీ వరకు కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. 85 ఏండ్లు నిండిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు రోనాల్డ్‌ రోస్‌. బై ఎలక్షన్ కోసం ఈవీఎం లను వేరుగా ఉంచామని, హైదరబాద్ పార్లమెంట్ పరిధిలో 3986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్‌లో పాల్గొంటున్న ఉద్యోగుల ఓటర్ ఐడి లను ముందుగానే సేకరిస్తామని, ప్రతి ఉద్యోగి ఓటు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా అండగా ఉంటాను..

విశాఖలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెత్తందార్లు వచ్చి తెలుగు గడ్డ మీద ఇటుక ముక్క కూడా తీసుకుని వెళ్ళలేరని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎవరు టచ్ చేయలేరని అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టిన వాళ్ళే వారసులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు.. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది.. తెలంగాణ, ఆంధ్రలో ఢిల్లీ వెళ్లి వంగి దండాలు పెట్టే వాళ్ళే కానీ.. ప్రశ్నించే నాయకత్వం లేకుండా పోయిందని మండిపడ్డారు.

 

Exit mobile version