NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రోజా అన్నీ గాలి మాటలు మాట్లాడుతుంది.. మంత్రి విమర్శనాస్త్రాలు

మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదని పార్టీలో అందరూ మారుతున్నారని తెలిపారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులు అందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు.. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించాం.. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టాం.. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నాం.. NREGS ద్వారా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సిమెంట్ రోడ్లు గ్రామాలకు వచ్చాయని వెల్లడించారు.

పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత

పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్‌ఫోర్స్‌, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది. గాజు ముక్కల పొడి, వివిధ రసాయనాల మిశ్రమంతో తయారైన ఈ మాంజా పతంగులు ఎగురవేసే పిల్లలకు తీవ్ర గాయాలు కలిగిస్తోంది.

నన్ను ఇక అలా పిలవద్దు.. పండుగ నాడు జయం రవి కీలక ప్రకటన

జయం సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన జయం రవి 25కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘కథలిక్ నేరమిల్లి’ రేపు (14-01-25) పొంగల్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతికా ఉదయనిధి దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో జయం రవి తన పేరును రవిమోహన్‌గా మార్చుకున్నాడు. తన X పేజీలో ఒక ప్రకటనలో, ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో కొత్త విషయాలు మొదలుపెట్టబోతున్నా, అవి మీతో షేర్ చేసుకుంటున్నా. సినిమా అనేది నా ప్యాషన్, అదే నన్ను ఇక్కడ నిలబెట్టి మీ అందరి సపోర్ట్ ఇచ్చింది. ఇకపై అందరూ నన్ను రవి లేదా రవి మోహన్ అని పిలవండి. ఇకపై నన్ను జయం రవి అని పిలవకండి, ఇది నా రిక్వెస్ట్. అలాగేరవి మోహన్ స్టూడియోస్ స్థాపించి సరికొత్త కథలను సినిమాల రూపంలోకి మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నా ఫ్యాన్స్ కి నేనిచ్చే మెసేజ్ ఏంటంటే.. నాకున్న అన్ని ఫ్యాన్స్ క్లబ్స్ ని కలుపుతూ రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థగా మారుస్తున్నా, దీని ద్వారా సేవా సహాయ కార్యక్రమాలు జేసి సొసైటీలో మంచిని పెంపొందించడం చేస్తాను.

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి తీవ్ర గాయాలు

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి (మం) కళ్యాణి డ్యామ్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు.. మదనపల్లి బస్సు డ్రైవర్ బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తిరుపతి నుంచి పీలేరుకు వెళుతున్న బస్సు, మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం జరగడంతో.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. క్షతగ్రాతులను రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కౌశిక్ రెడ్డి ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు

కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. నిన్న జరిగింది‌ అధికారిక సమావేశమని, నన్ను కౌశిక్ రెడ్టి చేతితో దొబ్బేసాడన్నారు. నిన్నటి మీటింగ్‌‌లో కౌశిక్ రెడ్టి నాతో‌ అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. నిన్నటి‌ సమావేశంలో కౌశిక్ నన్ను నెట్టివేసాడని, కౌశిక్ రెడ్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.? అని ఆయన ప్రశ్నించారు. నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదన్నారు. కౌశిక్ రెడ్టి రాజకీయాల్లోకి రాకముందే అయనపై కేసులు ఉన్నాయని, కౌశిక్ రెడ్టికి అందరినీ బెదిరించడం అలవాటని ఆరోపించారు ఎమ్మెల్యే సంజయ్‌. వరంగల్‌లో ఇలాగే బెదిరించి సెటిల్మెంటు చేసాడని, ఆయన తీరుపై స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేసాను… స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలన్నారు.

కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని

ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తన నివాసాన్ని పల్లెటూరి గ్రామంగా తీర్చి దిద్దారు. సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. కళాకారులు డప్పు చప్పుళ్లతో ప్రధానిని స్వాగతించారు. అనంతరం తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. మోడీ గంగిరెద్దులకు ఫలాలు అందించారు. భోగి మంటలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాని మోడీ గాయని సునీత పాడిన పాటలను విన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

జపాన్‌లో భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ!

జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. నైరుతి జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యుషు నైరుతి ద్వీపంలో ఉంది. మియాజాకి ప్రిఫెక్చర్‌తో పాటు పక్కనే ఉన్న కొచ్చి ప్రిఫెక్చర్‌కు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న భారం ఎవరీ మీద లేదు

ఖమ్మం జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న భారం ఎవరీ మీద లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వండని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండి కూడ ఒక్క ఎకరానికి నీళ్లు లేవన్నారు. ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాలకు గోదావరి జలాలు అందించాలనేది నా కోరిక అని, కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఖమ్మం 10 నియోజక వర్గాలు చల్లగా ఉంటాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మం జిల్లాలో రైల్వే లైన్ పూర్తి కావాలని జాతీయ రహదారులు పూర్తి అవ్వాలని కోరా అని. మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకుని గేలిపించుకున్నారు మీరు అబ్బా అనుకునేలా పని చేస్తా, ఛీఛీ అనేలా పని చేయనన్నారు. 30 కోట్లు ఇస్తే సత్తుపల్లి, అశ్వరావ్ పేట నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుని వస్తా అని, రైతులు అంతా కూడ పామెయిల్ వేయండి నేను గన్ ఇక్కడే పెట్టానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అంతేకాకుండా.. ఏప్రిల్ మే వరకు నీళ్లు తీసుకుని వస్తా పామెయిల్ వేయండని, 40 మండలాలకు నీళ్లు ఇచ్చే అవకాశం నాకు వచ్చిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. సంక్రాంతి పండగ సందర్భంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశం తీవ్ర రసాభాసకు దారితీసింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తనను దూషించడమే కాకుండా దాడి చేయడానికి ప్రయత్నించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల ముందు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సంజయ్, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.

కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బాబాలు… ఈ 5గురు బాబాలు ప్రత్యేకం..

భారతదేశ శాశ్వత సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీక అయిన మహా కుంభమేళా సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు పౌష్ పూర్ణిమ అమృత స్నానం. గంగా, యమున, సరస్వతి (అదృశ్య) నదుల సంగమంలో ఉదయం నుంచి భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఈరోజు దాదాపు కోటి మంది భక్తులు గంగాస్నానం చేస్తారని చెబుతున్నారు. కాగా.. ఈ కుంభమేళాలో పలువురు బాబాలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం..

రాధే పూరీ బాబా..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జెయిన్‌కి చెందిన రాధే పూరి బాబా.. ఆయన తపస్సును చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ బాబా గత 15 ఏళ్ల నుంచి తన చెయ్యి పైకి గాల్లో ఉంచారు. బాబా తపస్సు కారణంగా ఆయన చెయ్యి పని చేయకుండా అయిపోయింది. ఇప్పటికీ ఆ చేయి కిందికి పెట్టుకోవడానికి రావడం లేదు. ఆయన చేతి వేళ్లు ఒక దానితో ఒకటి దగ్గరకు ముడుచుకున్నాయి. గోర్లు కూడా తీసుకోకపోవడంతో అవి రింగులు తిరిగాయి. ఇది ఒక కఠోర తపస్సుగా చెప్పుకోవచ్చు. విశ్వకల్యాణం కోసం ఈ తపస్సు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జీవితాంతం ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది.

 

Show comments